ETV Bharat / state

ఏపీ ప్రభుత్వానికి మరోసారి సుప్రీంలో ఎదురుదెబ్బ - అహోబిలం మఠం ఈవో నియామకం అంశం

అహోబిలం మఠం కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మఠం సాధారణ కార్యకలాపాలతో ప్రభుత్వానికి ఏం సంబంధమని.. మఠాన్ని ఎందుకు చేజిక్కించుకోవాలనుకుంటున్నారని ధర్మాసనం ప్రశ్నించింది.

Delhi SC on State govt on Ahobilam matam Breaking
ఏపీ ప్రభుత్వానికి మరోసారి సుప్రీంలో ఎదురుదెబ్బ
author img

By

Published : Jan 27, 2023, 3:45 PM IST

SC ON AHOBILA : అహోబిలం మఠం ఈవో నియామకం విషయంలో.. సుప్రీంకోర్టులోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అహోబిలం మఠానికి ఈవో.. నియామకాన్ని తప్పుపడుతూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ.. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ వేసింది.

దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. మఠం సాధారణ కార్యకలాపాలతో.. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధమని నిలదీసింది. ఎందుకు మఠం చేజిక్కించుకోవాలనుకుంటున్నారని ప్రశ్నించింది. ఆలయాలు, ధార్మిక క్షేత్రాలను ధర్మకర్తలకే వదిలేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇందులో ప్రభుత్వ జోక్యం అవసరం లేదని తేల్చిచెప్పింది. హైకోర్టు తీర్పును సమర్ధించిన సుప్రీంకోర్టు ధర్మాసనం...ఈ ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.