లోకకళ్యాణం, ప్రజల ఆయురారోగ్యాల కోసం సుందరకాండ అఖండ పారాయణాన్నినిర్వహిస్తున్నట్లు తితిదే ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుమల నాదనీరాజన మండపంలో నిర్వహించిన ఆరో విడత సుందరకాండ అఖండ పారాయణంలో ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు.
సుందరకాండలో 20వ సర్గ నుంచి 24 సర్గ వరకు ఉన్న 185 శ్లోకాలను వేద పండితులు పారాయణం చేశారు. తిరుమల ధర్మగిరి వేదపాఠశాల, తిరుపతి వేద విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి సుమారు 200 మంది వేదపారాయణదారులు పాల్గొన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం సుందరకాండ పారాయణంతో పాటు భగవద్గీత పారాయణం, విరాట పర్వాలను సైతం నిరాటంకంగా కొనసాగిస్తున్నట్లు ఈవో జవహర్‌రెడ్డి వివరించారు.
ఇదీ చదవండి: వేలానికి 'బ్రహ్మ వజ్ర కమలం'.. రిజర్వ్ ధర ఎంతంటే?