Summer Special Avakaya : తెలుగింటి ఆవకాయ అంటే ప్రపంచ దేశాలు ఆహా అంటాయి. మన ఆవకాయ అంత స్పెషల్ మరి. ముఖ్యంగా విదేశాల్లో నివసించే మన తెలుగోళ్లు ఆవకాయ అంటే పడిచస్తారు. విదేశీ రుచులు మన తెలుగు వాళ్లకు అంతగా రుచించవు. మన తెలుగు రుచులు కొనాలంటే పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. అందుకే చాలా మంది పచ్చళ్లతో సరిపెట్టుకుంటారు.
Avakaya pickle storage tips : అలా విదేశాల్లో ఉన్న వారికి తమ కుటుంబం పంపించే పచ్చళ్లలో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఆవకాయ. అందుకే ఏడాదికోసారి అది కూడా వేసవిలో ఇక్కడి నుంచి ఆవకాయ పచ్చడి చేసి విదేశాల్లో ఉన్న వారికి పంపిస్తూ ఉంటారు వారి కుటుంబ సభ్యులు. మరి అది ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఎలా..? అందుకే ముందుగా తయారీ విధానంలోనే ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా జాగ్రత్తలు పాటిస్తారు. మరి ఆ జాగ్రత్తలేంటో మీరూ ఓ సారి చూసేయండి.
ఆవకాయ పెట్టినప్పుడు దాని నిల్వ ఉండాటానికి అందులో వేసే పదార్థాల పాళ్లు చాలా ముఖ్యం. తయారిలో అవి వేసేటప్పుడు కూడా అంత జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. పచ్చడి పెట్టే స్థలం శుభ్రంగా, పొడిగా ఉండాలి. పచ్చడి పెట్టేవారు శుభ్రంగా చేతులు కడుక్కొని, తడి ఉండకుండా చూసుకోవాలి. మామిడి ముక్కల్ని కడిగి కాటన్ వస్త్రంతో తుడిచి నీరు పోయేవరకు ఆరపెట్టాలి. మెత్తగా ఉన్న ముక్కల్ని, పండిన ముక్కల్ని తీసేయాలి. కాయలు కొట్టించేటప్పుడు ముక్కల్ని టెంకతో కొట్టిస్తే మంచిది.
పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఉంటుంది. ఆవకాయ పెట్టేటప్పుడు కారం ఎంచుకోవటం ముఖ్యమైన పని. రంగుతో పాటు నాణ్యత ఉన్న కారంపొడిని ఎంచుకోవాలి. పచ్చడిలో కారం వేసేటప్పుడు దొడ్డుప్పుని మాత్రమే వేయాలి. లేకపోతే కల్లుప్పుని వాడవచ్చు. వేరుసెనగ పప్పు లేదా నువ్వుల నూనె వాడితే పచ్చడి రుచిని పెంచుతుంది. ఆవకాయ కలిపిన తర్వాత సిరామిక్ జార్‌లు, జాడీలు, గాజుపాత్రల్లో ఏదైనా వాడవచ్చు. వాటిల్లో పచ్చడి పెట్టేటప్పుడు కాటన్ వస్త్రంతో తుడిచి ఆరపెట్టిన తర్వాత పచ్చడిని అందులో వేయాలి. పొడిగా ఉన్న ప్రదేశాల్లోనే పచ్చడి జాడీలని ఉంచాలి. కావాల్సినప్పుడు జాడీలోంచి పచ్చడిని తీసి చిన్న గిన్నెలో లేదా బాక్సులో పెట్టుకోవాలి. నూనె తక్కువ అయితే కావాల్సినంత వేరుసెనగ లేదా నువ్వుల నూనె గొరువెచ్చగా వేడి చేసి పచ్చడిలో కలపాలి.
ఇవీ చదవండి: