ETV Bharat / state

World mental health day: దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరికి మానసిక రుగ్మత.!

author img

By

Published : Oct 9, 2021, 3:35 PM IST

దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ(World mental health day) శాఖ తెలిపింది. ఈ మేరకు మానసిక రుగ్మతలున్న వారికి సంబంధిత వైద్య నిపుణుల సహకారంతో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఆదివారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది.

world mental health day
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

మానసిక సమస్యలు(World mental health day) ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతున్నాయని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ(World mental health day) పేర్కొంది. రేపు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనరేట్(commissionerate of health and family welfare)​ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. భారత్​లో ప్రతి ఏడుగురిలో ఒకరు మానసిక రుగ్మతలతో సతమతమవుతున్నట్లు పేర్కొన్న ఆరోగ్య శాఖ.. వారిలో చాలా మందికి తమకు అలాంటి సమస్యలు ఉన్నట్లు తెలియడం లేదని తెలిపింది.

మానసిక ఆరోగ్యం(World mental health day) పట్ల ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం.. జాతీయ మానసిక ఆరోగ్య పథకం కింద రాష్ట్రంలో పౌరులందరికీ 2019 నుంచి మానసిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆరోగ్య శాఖ గుర్తు చేసింది. ఇందులో భాగంగా ఆశా కార్యకర్తలు ఇంటింటి సర్వే నిర్వహించి, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులను(World mental health day) గుర్తిస్తున్నారని పేర్కొంది. వీరికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రంలో మానసిక వైద్య నిపుణుల సహకారంతో కౌన్సిలింగ్, ఓపీ సేవలు అందుబాటులో ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం 21 జిల్లాల్లో ఈ తరహా సేవలు అందుబాటులో ఉండగా... మిగతా జిల్లాల్లోనూ దశలవారీగా మానసిక వైద్య సేవలను విస్తరించనున్నట్లు పేర్కొంది. కుంగుబాటు, అనవసరపు ఆందోళనకు గురవుతున్న వారు ప్రభుత్వం అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని కోరింది.

ఇదీ చదవండి: mlc kavitha about Breast cancer: 'అమ్మాయిలకు సంవత్సరానికి ఒకసారి వైద్య పరీక్షలు తప్పనిసరి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.