ETV Bharat / state

Success story: అమెరికాలో ఐటీ ఉద్యోగం వదిలేశాడు.. ఆవులతో కోట్లు...

అమెరికాలో ఇంటెల్​ సంస్థలో ఉద్యోగం... లక్షల రూపాయల జీతం. కానీ.. ఏదో వెలితి. అసంతృప్తి. స్వదేశానికి వెళ్లి వ్యవసాయం చేయాలనే ఆలోచనలు అతడిని అనునిత్యం వెంటాడాయి. ఇక.. అమెరికాలో ఉండలేక.. ఉద్యోగాన్ని వదిలిపెట్టి.. స్వదేశానికి వచ్చేసి... పాల వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ వ్యాపారం పెట్టే సమయంలో అతడికి దానిపై పెద్దగా అవగాహన లేదు. అంకితభావంతో పనిచేస్తే.. అనుభవం అన్నీ నేర్పిస్తుందంటారు. అది కిశోర్ జీవితంలో నిరూపితమైంది. డైరీ ఫామ్ ఏర్పాటు చేసి.. పదిమందికి ఉద్యోగ అవకాశం కల్పించడంతో పాటు.. కల్తీలేని స్వచ్చమైన పాలను అందిస్తున్నారు కిషోర్ ఇందుకూరి.

Success story
Success story: లక్షల జీతం వచ్చే ఉద్యోగం వదిలి.. ఆవులను కొని కోట్లు సంపాదిస్తున్నాడు!
author img

By

Published : Oct 6, 2021, 3:48 PM IST

Updated : Oct 6, 2021, 5:08 PM IST

Success story: అమెరికాలో ఐటీ ఉద్యోగం వదిలేశాడు.. ఆవులతో కోట్లు...

ప్రస్తుతం ఎక్కడ చూసినా... కల్తీ రాజ్యమేలుతుంది. ముఖ్యంగా ఆహార పదార్థాల్లో, పాలలో ఇలా ఎక్కడ చూసిన కల్తీ మయమైపోతున్నాయి. కానీ.. వాటికి భిన్నంగా కల్తీలేని స్వచ్ఛమైన పాలను ఉత్పత్తి చేయాలని కిశోర్ ఇందుకూరి సంకల్పించారు. అందుకే తన కుమారుడి పేరు మీద సీడ్స్ డైరీ ఫామ్​ను స్థాపించాడు. తన ఉత్పత్తుల్లో ఎప్పటికీ కల్తీ ఉండదని కుమారుడికి వాగ్దానం చేశాడు. ఆ మాటమీదనే నిలబడ్డాడు.

సీడ్స్ ఫామ్​ ఎలా పుట్టిందంటే..

సీడ్స్ ఫార్మ్ డాక్టర్ కిశోర్ ఇందుకూరి ఖరగ్ పూర్ యూనివర్సిటీలో ఐఐటీ విద్యనభ్యసించి... యుఎస్‌ఏలోని ఇంటెల్ కార్పొరేషన్‌లో 6 సంవత్సరాల పాటు పనిచేశారు. అయితే.. అక్కడ చేసే ఉద్యోగం అతడికి సంతృప్తి ఇవ్వలేదు. స్వదేశంలోనే వ్యవసాయం చేయలని పదేపదే ఆలోచనలు అతడిని చుట్టుముట్టాయి. ఇక ఉద్యోగం మానేసి హైదరాబాద్​​కు వచ్చేశారు. హైదరాబాద్‌లో స్వచ్ఛమైన, కల్తీ లేని పాల ఉత్పత్తులు చేయాలని కిశోర్ నిర్ణయించారు. అందుకు సంబంధించిన వాటిని పరిశోధించారు. సీడ్స్ ఫామ్ రంగారెడ్డి జిల్లాలోని షాబాద్​లో 2013 సంవత్సరంలో 2.5 ఎకరాల విస్తీర్ణంలో పాలను ఉత్పత్తి చేసే సీడ్స్ ఫామ్​ను స్థాపించారు.

నాకు వ్యవసాయం చేయాలనే కోరిక ఉండేది. అందుకే అమెరికాలో లక్షల రూపాయలు వచ్చే జీతాన్ని వదిలి భారతదేశానికి వచ్చాను. అందరికీ కల్తీలేని పాలు అందించాలని నిర్ణయించుకున్నాను. ఆ ఉద్దేశ్యంతోనే... సీడ్స్​ డైరీ ఫామ్​ పెట్టాను. అన్ని పద్ధతులు అనుసరించి.. మొదట నష్టాల బాట పట్టినా.. ఆ తర్వాత లాభాలు వచ్చాయి.

- కిశోర్​ ఇందుకూరి, సీడ్స్​ డైరీ ఫామ్ వ్యాపారస్తుడు

నష్టాల నుంచి లాభాల వైపు...

ప్రస్తుతం 4,000 చదరపు అడుగుల పాల ప్రాసెసింగ్ సదుపాయంతో పాటు మరో 1.5 ఎకరాల స్థలంలో ఒక మోడల్ డెయిరీ ఫామ్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. పాలను నిత్యం పరీక్షించేందుకు అత్యాధునిక ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. పాలలో ఎటువంటి కల్తీలేకుండా... చూసేందుకు ప్రతిరోజూ ఇక్కడ 2,000 పరీక్షలు నిర్వహిస్తున్నారు. సంస్థను ప్రారంభించిన కొత్తలో కిశోర్ అనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. పాలు ఉత్పత్తికి అయ్యే ఖర్చుకు వచ్చే ఆదాయానికి భారీ వ్యత్యాసం ఉండడంతో ఖర్చు తగ్గించాలని నిర్ణయించారు. మరోపక్క వినియోగదారుల నుంచి పాలకు మంచి స్పందన రావడంతో డిమాండ్ పెరిగింది. దీంతో పశువుల మేతను సొంతంగా ఉత్పత్తి చేసుకోవడం, తక్కువ ఖర్చుతోనే పాలను ఉత్పత్తి చేయడంపై దృష్టిసారించారు. ఖర్చు తగ్గించుకోవడంతో ఆ విధంగా నష్టాల నుంచి బయడపడ్డారు. సీడ్స్ ఫామ్​లో కేవలం పాల ఉత్పత్తులే కాకుండా.. రైతుల కోసం క్రమం తప్పకుండా శిక్షణ కార్యకలాపాలను కూడా నిర్వహిస్తుంటారు.

ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ...

ప్రస్తుతం సీడ్స్ డైరీ ఫామ్​లో ప్రతిరోజూ 17,000 లీటర్ల పాలు, పాల ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నారు. వీటిని బిగ్ బాస్కెట్ డైలీ, సూపర్ డైలీ, మిల్క్ బాస్కెట్, క్యూబ్యాగ్, ఇతర స్టోర్స్, అపార్ట్​మెంట్లు, ఇంటికే పాల సరఫరా వంటి కార్యక్రమాల ద్వారా వినియోగదారులకు, ఏజెంట్లకు పాల ఉత్పత్తులను చేరవేస్తున్నారు. సిడ్స్ ఫామ్ డైరీలో నగరంలో 50 మంది, గ్రామీణ ప్రాంతాల్లో మరో 40 మంది పనిచేస్తున్నారు. సీడ్స్ డైరీ ఫామ్ తాత్కాలికంగా పనిచేసేందుకు 150 మంది డెలివరీ భాగస్వాములను కూడా నియమించింది. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక యువతకు ఉద్యోగాలను కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నామని సీడ్స్ డైరీ ఫామ్ యజమాని కిషోర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నిపుణులైన వారిని ప్రయోగశాలలో సాంకేతిక నిపుణులుగా, నాణ్యత ప్రమాణాలు పరిశీలించేందుకు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌లు వంటి వివిధ రంగాల్లో నియమించామని పేర్కొన్నారు. సీడ్స్​ఫామ్ నిర్వాహకులు చదువుకునే విద్యార్థులకు కోసం పాఠశాల పర్యటనలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారిని ఫామ్​కు తీసుకువచ్చి... ఇక్కడ ఉండే ప్రతి అంశాన్ని పశువులకు వేసే దాన నుంచి పాలు పితకడం, తిరిగి పాలు ఉత్పత్తి బయటకు వెళ్లే వరకు వారికి ప్రత్యక్షంగా చూపించేవిధంగా ఏర్పాట్లు చేశారు.

రైతులకు భరోసా.. ఈ సీడ్స్​ ఫామ్

సీడ్స్​ ఫామ్ యాజమాన్యం స్థానిక రైతులకు గ్రామాల్లోని రైతులకు పశువులపై అవగాహన కల్పిస్తోంది. పశువుల ఆరోగ్య తనిఖీలు చేయడం, వారికి అవసరమైన సేవలను అందించడం ద్వారా రైతులకు నాణ్యమైన పశుగ్రాసానికి సంబంధించిన సూచనలు అందిస్తుంటారు. తద్వార రైతులకు ఆర్థిక నష్టాలను తగ్గించగలిగామని పేర్కొంటున్నారు. సకాలంలో పాల సేకరణ, పశువుల మంద నిర్వహణ వంటి పద్ధతులపై అవగాహన కల్పించడం కూడా చేస్తుంటారు. సీడ్స్ డైరీ ఫామ్ ప్రస్తుతం 1,200 మంది రైతులను నేరుగా సమన్వయం చేసుకుంటుంది. పశువైద్యుల భాగస్వామ్యంతో కృత్రిమ గర్భధారణపై కూడా వీరు దృష్టిసారించారు. స్వచ్ఛమైన పాల ఉత్పత్తిలో ముఖ్యమైన అంశం.. రైతు, గ్రామ స్థాయికి శీతలీకరణ సామర్థ్యాన్ని తీసుకువెళ్లడంపై సీడ్స్​ఫామ్ దృష్టిసారించింది. నాణ్యమైన పాలను పితికిన కొన్ని గంటల్లోనే పాలను చల్లబరచడానికి తక్షణ మిల్క్ చిల్లింగ్ సిస్టమ్స్‌పై ప్రస్తుతం పెట్టుబడి పెడుతున్నామని... అవి భవిష్యత్​లో పనికొస్తాయని కిశోర్ ఇందుకూరి పేర్కొంటున్నారు.

ఎన్నో ఉత్పత్తులు... తక్కువ ధరలో..

భారతదేశంలో విక్రయించే పాలు, పాల ఉత్పత్తులు చాలా వరకు మిశ్రమ పాలతో తయారు చేయబడతాయి. కానీ సీడ్స్ డైరీ ఫామ్​లో వీటికి భిన్నంగా ఆవు, గేదె పాల ఉత్పత్తులను వేర్వేరుగా తయారుచేస్తారు. ఆవు పాలు తేలికైనవి, తక్కువ కొవ్వు కలిగి ఉంటాయి. గేదె పాలలో కొవ్వు ఎక్కువ ఉంటుంది. వ్యక్తిగత ప్రాధాన్యత, రుచి ఆధారంగా, తమ వినియోగదారులు ఆవు పెరుగు, గేదె పెరుగును ఎంచుకునే అవకాశం ఉంటుందని సీడ్స్ ఫామ్ నిర్వాహకులు తెలిపారు. సీడ్స్ ఫామ్ ఆవు నెయ్యి, గేదె నెయ్యి, ఆవు వెన్న, గేదె వెన్న, ఆవు పాలు, గేదె పాలను, పన్నీర్​లను ప్రత్యేకంగా తయారు చేసి విక్రయిస్తున్నామని నిర్వాహకులు పేర్కొంబటున్నారు.

ఇదీ చదవండి: creative ways to save money: వయసు 37 ఏళ్లు.. పొదుపు రూ.10 కోట్లు.. ఎలా సాధ్యమైందంటే?

Last Updated : Oct 6, 2021, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.