ETV Bharat / state

ఇంకా తీరు మారని ఇంటర్ బోర్డు

ఇంటర్‌ బోర్డు అధికారుల తీరు ఇప్పటికీ మారలేదు. అదే నిర్లక్ష్యం... అదే అలసత్వం. ఆదివారం రోజు విడుదలైన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష మూల్యంకనం సరిగా చేయలేదని ఇంటర్ బోర్డు ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అధికారులు నిర్లక్ష్యం వల్ల పిల్లల భవిష్యత్ నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకా తీరు మారని ఇంటర్ బోర్డు
author img

By

Published : Jul 15, 2019, 5:27 PM IST

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష మూల్యంకనం సరిగా చేయలేదని హైదరాబాద్ నాంపల్లి ఇంటర్ బోర్డు ముందు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఆదివారం విడుదలైన సప్లిమెంటరీ ఫలితాలు తప్పుల తడకగా ఉన్నాయంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. దీనిపై సంబంధిత అధికారులను అడిగినా సమాధానం చెప్పడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పిల్లలను ప్రత్యేక శ్రద్ధతో చదివించినా... గతంలో వచ్చిన మార్కుల కంటే తక్కువగా వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలు రాసిన పరీక్ష పత్రాలను ఆన్లైన్​లో పెట్టాలని వారు డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ పిల్లలు విద్య సంవత్సరం కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పునర్‌మూల్యాంకనం చేసి విద్యార్థుల భవిష్యత్​ను కాపాడాలని తల్లిదండ్రులు కోరారు.

ఇంకా తీరు మారని ఇంటర్ బోర్డు

ఇవీచూడండి: ఇంటర్​ ద్వితీయ సంవత్సర సప్లీ​ ఫలితాలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.