కరోనా కారణంగా పాఠశాలలు ప్రారంభం కాకపోవటంతో 6, 7, 8 తరగతుల వారికి ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతున్నారు. పట్టణాల్లో విద్యార్థులకు ఇది సౌకర్యవంతమే అయినా, పల్లెల్లో మాత్రం అవస్థలు తప్పడం లేదు.
ఏపీలోని కర్నూలు జిల్లా మద్దికెర మండలం బొజ్జనాయునిపేట గ్రామంలో మొబైల్ నెట్‌వర్క్ లేనందున ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కాగానే కొందరు విద్యార్థులు పొలాల్లోని చెట్లపైకి ఎక్కి వినాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నెట్‌వర్క్ సిగ్నళ్లు రానందున తమకు, తమ పిల్లలకు కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: ఆస్తుల నమోదులో ఆధార్ సంఖ్యే కీలకం