ETV Bharat / state

'హెచ్‌సీయూలో రిజర్వేషన్ విధానాల ఉల్లంఘన'

హెచ్‌సీయూ వైస్ చాన్స్‌లర్ అప్పారావు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది సంయుక్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వెంటనే ప్రత్యేక ప్రవేశ డ్రైవ్ నిర్వహించి యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పీహెచ్‌డీ, ఎంఫిల్ సీట్లను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

students-allegation-to-violation-of-reservation-procedures-in-hcu
హెచ్‌సీయూలో రిజర్వేషన్ విధానాల ఉల్లంఘన..!
author img

By

Published : Dec 25, 2020, 1:18 PM IST

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అప్పారావు రిజర్వేషన్ విధానాలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ ఓబీసీ విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది సంయుక్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఖాళీగా ఉన్న పీహెచ్‌డీ, ఎంఫిల్ సీట్లను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేశారు.

హెచ్‌సీయూ వైస్ చాన్స్‌లర్ అప్పారావు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని పలువురు విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది ఆరోపించారు. సామాజిక న్యాయం కావాలని కోరుతూ యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ ‌కిష్టయ్య పాల్గొన్నారు. జాతీయ బీసీ కమిషన్‌ నివేదికలో పేర్కొన్న ప్రకారం ఓబీసీ విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక ప్రవేశ డ్రైవ్ నిర్వహించి జూన్ 2020 నోటిఫికేషన్‌లో ఖాళీగా ఉన్న పీహెచ్‌డీ, ఎంఫిల్‌ సీట్లను భర్తీ చేయాలని కోరారు.

ఇదీ చదవండి: రైతు పోరు ఉద్ధృతం- చర్చలపై నేడు నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.