ETV Bharat / state

నడినెత్తిన మంటలు.. పొట్టలో ఆకలి దప్పులు.. - వలస కార్మికులపై లాక్​డౌన్ ఎఫెక్ట్ న్యూస్

నడినెత్తిన మంటలు.. పొట్టలో ఆకలి దప్పులు..! పాదాల కింద నిప్పులు.. చంకలో పసిబిడ్డలు..! ఏ దారిన వెళ్తున్నారో తెలీదు.. ఎప్పటికి గమ్యం చేరతారో తెలీదు..! రెండు కాళ్లే చక్రాలై సాగుతున్న సుదీర్ఘ ప్రయాణం.. చెమటలు కక్కుతున్న దేహాలతో.. అలసి సొలసి రోడ్డుపక్కనే విరామం..! దాతల అన్నంతో పసిబ్డిడ్డల ఆకలి తీర్చి.. గుక్కెడు నీటితో సరిపెట్టుకుంటున్న తల్లులు..! ఊరు కాని ఊరిలో మహమ్మారి తరిమితే జన్మభూమికి పయనమైన అభాగ్యులు...! ఉన్న ఊరిని, కన్నవారిని చేరుకోవాలనే తపనతో వలస జీవి సాగిస్తున్న ఎడతెగని పయనం నిరుపేద బతుకు చిత్రానికి నిలువెత్తు దర్పణంగా నిలుస్తోంది.. వలస కార్మికుల వెతలపై ఈటీవీ-ఈనాడు- ఈటీవీ భారత్ పరిశీలనాత్మక కథనం.

struggles-of-migrate-workers-on-nhs
వలస వెతలు: నడినెత్తిన మంటలు.. పొట్టలో ఆకలి దప్పులు..
author img

By

Published : May 15, 2020, 10:44 AM IST

వలస వెతలు: నడినెత్తిన మంటలు.. పొట్టలో ఆకలి దప్పులు..

అక్కడ కనిపించిన దృశ్యాలు ఎంతటివారినైనా గుండెలు పిండేసేవే.. అమ్మా ఆకలి... అని ఆ పిల్లలు అడిగినప్పుడల్లా ఆ తల్లి మనసు తల్లడిల్లుతోంది..! నెలల పసిపాపకు రోజుల తరబడి గుక్కెడు పాలూ పట్టలేని దైన్యం మరో తల్లి గుండెను కోసేస్తోంది...! ఎండలో నడిచి నడిచి అరికాళ్లు బొబ్బలెక్కిన కన్న బిడ్డను చూసి ఓ తండ్రి కళ్లు చెమరుస్తున్నాయి..! ఒకరా ఇద్దరా కొన్ని వేల మంది... అరిగిన చెప్పులు, మాసిన బట్టలు, తిండిలేక లోపలికి పోయిన డొక్కలతో, నిప్పులు చెరుగుతున్న ఎండలోను రాత్రనక, పగలనక నడుస్తూనే ఉన్నారు... వందల వేల కిలోమీటర్లు భారంగా ముందుకు సాగుతున్నారు.

అంతులేని విషాదం...

నెలల పసిబిడ్డను చంకకెత్తుకుని, మూడు నాలుగేళ్ల పిల్లాడి చేయి పట్టుకుని నడుస్తున్న తల్లి ఒకరు... నెత్తిన బరువెత్తుకుని, భార్యా పిల్లలతో నడిచిపోతున్న బడుగు జీవి మరొకరు... చేతిలో మిగిలిన డబ్బంతా పెట్టి ఓ పాత సైకిల్‌ కొనుక్కుని సాగిపోతున్నవారు కొందరు... అందరిదీ ఒకటే కష్టం...! పేగుల్ని మెలిపెడుతున్న ఆకలి... సమాజం తమను ఏకాకుల్ని చేసిందన్న బాధ...! ఈ ప్రభుత్వాలు, వ్యవస్థ తమను పట్టించుకోలేదన్న ఆవేదన..! నా అన్నవాళ్లనీ, పుట్టిన ఊరునీ వదిలేసి... పొట్ట కూటికోసం ఇంత దూరం వస్తే... కష్టకాలంలో ఎవరూ ఆదుకోక, పరాయివాళ్లుగా మిగిలిపోయామన్న భావన... వారికి అంతులేని విషాదాన్ని మిగిల్చింది.

చేతిలో చిల్లిగవ్వ లేక...

లాక్​డౌన్ దెబ్బకు... తినీ తినక దాచుకున్న కొద్దిపాటి డబ్బూ ఎప్పుడో అయిపోయింది. ఉన్న చోట పని లేక... చేతిలో చిల్లిగవ్వ లేక... అక్కడే ఉంటే బతుకుతామో లేదో తెలీక... ప్రాణాలకు తెగించి సొంత రాష్ట్రాలకు కాలి నడకన సాగిపోతున్నారు. ఎక్కడి కన్యాకుమారి, ఎక్కడి జార్ఖండ్‌...! ఎక్కడి చెన్నై, ఎక్కడి లక్‌నవూ..! అంతా బాగుంటే అంత దూరం నడిచి వెళ్లాలన్న ఊహే భయపెడుతుంది..! కానీ అక్కడే ఉండి, ఆకలితో చనిపోయే కంటే... ఉన్న ఊరికి చేరితే ఏదోలా బతకొచ్చన్న ఆశతో, మొండి ధైర్యంతో వేల కిలోమీటర్ల దూరాన్నీ లెక్క చేయకుండా వలస కార్మికులు నడుస్తూనే ఉన్నారు. ఇప్పట్లో పని దొరుకుతుందన్న ఆశ లేక, వ్యవస్థపై నమ్మకం లేక, ప్రభుత్వాలు ఆదుకుంటాయన్న భరోసా లేక... సొంతూళ్లకు సాగిపోతున్నారు.

కాళ్లే చక్రాలై..

వలస కార్మికుల్ని తరలించేందుకు ప్రభుత్వం నడుపుతున్న ప్రత్యేక రైళ్లు, బస్సులు కొందరికే పరిమితమవుతున్నాయి. సంఘటితంగా ఒక చోట ఉన్న వలస కార్మికుల్నే అధికారులు తరలిస్తున్నారు. వాస్తవంగా వివిధ రాష్ట్రాలతో చిక్కుకున్న కార్మికులతో పోలిస్తే... ప్రభుత్వం తరలిస్తున్నవారి సంఖ్య చాలా తక్కువ. ప్రభుత్వం సహా ఎవర్నీ నమ్మలేక... మరో దారి లేక.... 42-43 డిగ్రీల ఎండలోను... కొన్ని రోజులుగా.... వేల సంఖ్యలో వలస కార్మికులు జాతీయ రహదారిపై కాలినడకన తరలిపోతున్నారు. ప్రాణాలు కడగట్టుకుపోతున్నా.... బతుకుపై ఆశతో... తరలి వెళుతున్నారీ వలస కార్మికులు. లారీ డ్రైవర్లను బతిమాలుకుని, వాటిలో ఎక్కి వెళ్లినవారు దీనికి అదనం. ఇలా తరలిపోతున్నవారిలో 80 శాతంపైగా కాలి నడకనే వెళుతున్నారు. ఈ మహా ప్రస్థానం ఎప్పటికి ముగుస్తుందో తెలీక ముందుకి సాగుతూనే ఉన్నారు.

భరోసా పోయింది...

ఇన్నాళ్లూ ఉపాధి కల్పించిన నగరం.. ఇకపైనా ఆదుకుంటుందనే భరోసా వారిలో పోయింది. నిన్న, మొన్నటి వరకూ తమతో పనులు చేయించుకున్న యజమానులే ముఖం చాటేసిన వేళ...మున్ముందు తమ పరిస్థితి మరింత దుర్భరమైపోతుందేమోనన్న ఆందోళన... వందలు, వేల కిలోమీటర్ల దూరంలోని సొంతూళ్లకు కాలినడకన వెళ్లిపోవాలన్న తెగింపు వారిలో తీసుకొచ్చింది. 50 రోజులుకు పైగా పనులు లేక, సరిగా తిండి లేక అల్లాడిపోయిన దైన్యం వారిని మొండిగా మార్చేసింది. శ్రామికరైళ్లు, బస్సులు నడుపుతున్నామంటూ ప్రభుత్వాలు చెబుతున్న మాటలు నమ్మి.. వాటి కోసం పదే పదే దరఖాస్తు చేసుకుని.. కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవటంతో వారికి సొంతూళ్లకు వెళ్లేందుకు కాలినడకే దిక్కయ్యింది.

పాలకు బదులు నీళ్లు

బిహార్ కు చెందిన ఈమె పేరు చాందినీ.. అయిదేళ్లలోపున్న ఆ నలుగురు చిన్నారులు పాల కోసం ఏడుస్తున్నప్పుడు ఆ తల్లి గుండె బరువెక్కిపోతోంది. పాలకు బదులూ నీళ్లు పడుతూ నడక సాగిస్తోంది. చాందినీ భర్త గుంటూరు మిర్చి యార్డులో పనిచేస్తారు. లాక్‌డౌన్‌తో గత 50 రోజులుగా పనులు లేవు. ఇక ఇక్కడే ఉంటే కష్టమేనన్న ఆందోళన చెంది ఆమె భర్త, మరికొంతమంది బంధువులతో కలిసి కాలినడకన పయనం ప్రారంభించింది. భుజాలపై అయిదేళ్ల చిన్నారిని మోసుకుంటూ కాలినడకన ముందుకు సాగిపోతున్న సత్యానిది విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం. మంగళగిరి సమీపంలో వలస కూలీగా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌తో పనులు లేక...డబ్బులన్నీ ఈ వ్యవధిలో తిండికే ఖర్చయిపోయాయి. ఇంకా ఇక్కడే ఉంటే ఆకలితో పోరాటం చేయాల్సి వస్తుందనే భయంతో భార్య, పిల్లలు, తమ ప్రాంతానికి చెందిన మరో 30 మందితో కలిసి కాలినడనకన బయల్దేరాడు.

పస్తులున్న వలస పక్షులు...

మండుటెండల్లో వందల మైళ్లకొద్దీ దూరం నడిచి ఫుట్‌పాత్‌పై సేదతీరుతున్న వీరంతా పశ్చిమబెంగాల్, ఒడిశా వాసులు. చెన్నైలో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ మొదలైనప్పటి మేస్త్రీ పత్తాలేకుండా పోయాడు. చాలా రోజులు పస్తులతోనే గడిపి... ఇంకా అక్కడే ఉంటే ఆకలితో చచ్చిపోవాల్సి వస్తుందేమనని ఆందోళనతో నాలుగు రోజుల కిందట చెన్నై నుంచి బయల్దేరి.. బుధవారం రాత్రికి విజయవాడకు చేరుకున్నారు.

650 కిలోమీటర్లు నడక..

ఒంగోలు నుంచి 650 కి.మీ దూరంలో ఉన్న ఒడిశాలోని కొరాపూట్‌ జిల్లాకు కాలినడకన వెళ్తున్న వీరంతా గ్రానైట్‌ ఫ్యాక్టరీల్లో పనిచేస్తుంటారు. లాక్‌డౌన్‌ కాలంలో యజమాని బియ్యం, కూరగాయలు వంటివి సరఫరా చేశారు. అయితే అందుకైన ఖర్చును అప్పుగా ఇచ్చినట్లు చూపించి.. ఆ సొమ్మును వారి నుంచి జమ చేసుకున్నాడు. దీంతో ఆందోళన చెందిన వీరంతా ఎంత దూరమైనా సరే ఊరెళ్లిపోవటమో మేలనుకుని బయల్దేరారు.

చెన్నై టు శ్రీకాకుళం వయా సైకిల్...

ఎక్కడ చెన్నై.. ఎక్కడ శ్రీకాకుళం... భార్య, రెండేళ్ల కుమారుడిని వెంటపెట్టుకుని చెన్నై నుంచి దాదాపు 920 కిలోమీటర్ల దూరంలోని శ్రీకాకుళం జిల్లా భామిని మండలానికి కాలినడకనే బయల్దేరారు చిన్నారావు. మూడు రోజుల కిందట చెన్నైలో మొదలైన ఆయన బుధవారం అర్థరాత్రి కాజా టోల్‌గేట్‌ వద్దకు చేరుకున్నారు.

చెన్నై నుంచి లక్​నవూ..

చెన్నై నుంచి 1,900 కి.మీ దూరంలోని లక్‌నవూకు కాలినడకన వెళ్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన మిహర్‌ అతని మిత్రులు చెన్నైలో రోజు కూలీలుగా పనిచేస్తుంటారు. వారు పనిచేసే చోట ఉపాధి లేకపోవటం, వీరి తిండి, బాగోగులు గురించి ఎవ్వరూ పట్టించుకోకపోవటంతో గత్యంతరం లేక నాలుగు రోజుల కిందట చెన్నైలో బయల్దేరి బుధవారం రాత్రికి విజయవాడకు చేరుకున్నారు.

పట్టణాలకు ఇక రాంరాం

చెన్నై నుంచి ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాలకు వెళ్తున్న వారిలో కొంతమంది సైకిళ్లపై వెళ్తున్నారు. ఇలా వెళ్తున్న వారిలో 90 శాతం మంది 30 ఏళ్ల లోపు యువతే. కొంతమంది ఇంటి వద్ద నుంచి డబ్బులు తెప్పించుకుని కొత్త సైకిళ్లు కొనుక్కొని వాటిపై ప్రయాణం సాగిస్తున్నారు. సైకిల్‌పై వెళ్తున్న రమణ, మంగమ్మలది శ్రీకాకుళం జిల్లా అముదాలవలస. వీరిరువురు భార్యభర్తలు. చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చేంత వరకు ఆకలితోనే వచ్చారు. మరో 5 రోజులు ఇంటికి చేరుతామని చెప్పారు. వీరిలో ఎవర్ని కదలించినా ‘‘జీవితంలో ఎన్నడూ మళ్లీ ఇటు రాబోము.. కలో గంజో తాగి ఊళ్లోనే బతుకుతాం అనే మాటే వినిపించింది. అసలు నగరమంటేనే నమ్మకం పోయిందనే మాటే ధ్వనించింది.

కేవలం 24 గంటల బాధలే ఇవి

వలస కూలీల వెతలు తెలుసుకునేందుకు... ఈటీవీ-ఈనాడు-ఈటీవీ భారత్ ప్రతినిధులు.. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై కాజా టోల్‌ప్లాజా సమీపంలో బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి గురువారం సాయంత్రం 4 గంటల వరకూ 24 గంటలపాటు పరిశీలించారు. ఇలా వందలాది మంది కాలినడకన పొట్ట చేతపట్టుకొని సొంత గ్రామాలకు తరలిపోతున్న వలస బాధితులు ఎంతమందో!

ఇదీ చదవండి: రాష్ట్ర సరిహద్దులో వలస కార్మికుల రచ్చ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.