హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద కేజీబీవీ వర్కర్స్, నాన్ టీచింగ్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. పాఠశాలలో కార్మికులు, బోధనేతర సిబ్బందితో అత్యధికంగా పని చేయించుకొని అతి తక్కువ జీతాలు చెల్లిస్తున్నారని అసోసియేషన్ అధ్యక్షురాలు పద్మ ఆరోపించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోతే సమ్మె చేస్తామని ఆమె హెచ్చరించారు. సీఎం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవటం విచారకరమని కేజీబీవీ ప్రతినిధి విమల ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీచూడండి: మంత్రి కేటీఆర్‌తో విదేశీ ప్రతినిధుల భేటీ