ETV Bharat / state

రాష్ట్రంలో ఆగని వీధికుక్కల బీభత్సం.. ఆరుగురిపై దాడి - Jangaon District Latest News

Street Dog Attacks In Telangana: రాష్ట్రంలో వీధి కుక్కల దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. దీంతో ఇంట్లో నుంచి బయటకి రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా వేర్వేరు ప్రాంతాల్లో కుక్కల దాడిలో ఆరుగురు గాయపడ్డారు.

Street dogs
Street dogs
author img

By

Published : Mar 2, 2023, 3:57 PM IST

Street Dog Attacks In Telangana: రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు లోనుచేస్తున్నాయి. పిల్లలు ఒంటరిగా ఇల్లు దాటితే ఏం జరుగుతుందో అన్న భయం తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల హైదరాబాద్​లో వీధి కుక్కలు బాలుడిని చంపిన ఘటన మరువకముందే.. తాజాగా రాష్ట్రంలోని పలుప్రాంతాలు శునకాలు హల్​చల్ చేస్తూ దాడులకు దిగుతున్నాయి.

జనగామ జిల్లాలోని టీచర్స్ కాలనీలో ఒక్కరోజే ఏకంగా నలుగురిపై ఓ పిచ్చికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బాధితుల్లో ఆరేళ్ల చిన్నారి కాగా, మరో ముగ్గురు ఉన్నారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలోనే పిచ్చికుక్క వీధుల్లో తిరుగుతూ కనిపించిన ప్రతి ఒక్కరిపై దాడి చేస్తుండడంతో స్థానికులు కర్రలతో వెంటపడి దాన్ని చంపేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పట్టణంలో కుక్కల బెడదను నివారించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

బాసర ఆర్జీయూకేటీలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులపై కుక్కలు దాడి చేశాయి. దీంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారికి చికిత్స అందించారు. మరోవైపు క్యాంపస్​లో వీలైనంత త్వరగా శునకాలను పట్టుకునేందుకు సిబ్బందికి ఆదేశాలు జారీచేశామని అధికారులు తెలిపారు.

ఏడాది కాలంలో 50 ఘటనలు : హైదరాబాద్​లో ఏడాది కాలంలోనే ఇలాంటి ఘటనలు 50 జరిగాయి. గత నెలలో శాన్వి అనే అమ్మాయిపైనా ఇలాగే శునకాలు దాడికి పాల్పడ్డాయి. శ్రీకాకుళానికి చెందిన 5 ఏళ్ల తునుశ్రీ షాప్​కి వెళ్లింది. ఆమె తిరిగి వస్తున్న సమయంలో సుమారు 5 కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చగా చేతిలోని నరాలు దెబ్బతిని ఇన్​ఫెక్షన్ సోకినట్లు వైద్యులు తెలిపారు.

గుంపులుగా తిరుగుతూ భయాందోళనలకు గురిచేస్తోన్న గ్రామసింహాలు: నగరం, పట్టణం, పల్లె ఎక్కడ చూసినా గ్రామసింహాలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. బడికి వెళ్లే తమ పిల్లల వెంట పడితే పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పనులు ముగించుకొని రాత్రి పూట ఇంటికి చేరేవారు సైతం ప్రాణాలు అర చేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం, సాయంత్రం వాకింగ్​లకు వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారులకూ కష్టాలు తప్పడం లేదు.

అధికారులకు ఫిర్యాదులు వెల్లువ: రాష్ట్రంలో కుక్కల దాడులు పెరిగిపోవడంతో అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అయితే అధికారులు మాత్రం కొన్నింటినే తీసుకెళ్లి.. వాటికి సంతానోత్పత్తిని నియంత్రించే ఆపరేషన్ చేసి మళ్లీ కాలనీల్లోనే వదిలేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా శునకాల బెడద నుంచి శాశ్వత పరిష్కారం చూపాలని వారు వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి: రాష్ట్రంలో వీధికుక్కల బీభత్సం.. ఒక్కరోజే 16 మందిపై దాడులు

వీధికుక్కల స్వైరవిహారం.. హైదరాబాద్​లో మరో బాలుడిపై దాడి

పోలీసుల కస్టడీలో సైఫ్​.. మట్టేవాడ పోలీస్​ స్టేషన్​లో విచారణ

త్రిపురలో కాషాయ జోరు.. మరోసారి అధికారం దిశగా బీజేపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.