విద్యార్థినులు శానిటరీ న్యాప్కిన్స్ విషయంలో ఎలాంటి అపోహలకు గురి కావొద్దని స్ట్రీట్ కాజ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్ ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో స్ట్రీట్ కాజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ విభాగం ప్రతినిధులు విద్యార్థినులకు శానిటరీ న్యాప్కిన్స్ వాడకంపై అవగాహన కల్పించారు. అనంతరం వారికి శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ చేశారు. సంస్థ ప్రతినిధులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందిచారు. ప్రతి పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
ఇవీ చూడండి: షీ నీడ్ ద్వారా మహిళలకు ఉచిత శానిటరీ న్యాప్కిన్స్