ETV Bharat / state

తిరుపతి ఉపపోరు: శాసనసభ స్థానాల్లో అలా.. లోక్​సభ స్థానానికి ఇలా! - telangana news

తిరుపతి లోక్​సభ పరిధి ఓటర్లు విలక్షణ తీర్పు ఇస్తున్నారు. శాసనసభ, లోక్‌సభకు ఒకే సారి ఎన్నికలు జరిగినా తిరుపతి లోక్‌సభ స్థానం ఓ పార్టీకి, దాని పరిధిలో ఉన్న శాసనసభ స్థానాల్లో మరో పార్టీకి పట్టంకడుతున్న తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఓటర్లు తమ విలక్షణతను చాటుకుంటున్నారు. లోక్‌సభ పరిధిలో ఇప్పటి వరకు కాంగ్రెస్​కు అత్యధిక సార్లు పట్టం కట్టగా.. అసెంబ్లీ ఎన్నికల పరంగా తెదేపాను ఆదరించారు. స్వాతంత్య్రం అనంతరం.. తిరుపతి లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో 12 సార్లు కాంగ్రెస్‌, రెండు సార్లు వైకాపా, ఒకసారి తెదేపా, మరోసారి తెదేపా బలపరచిన భాజపా అభ్యర్థులు గెలుపొందారు.

Tirupati lok sabha by poll, ap by poll
తిరుపతి ఉప ఎన్నిక, ఆంధ్రప్రదేశ్ ఉప ఎన్నికలు ఉప ఎన్నిక: శాసనసభ స్థానాల్లో అలా.. లోక్​సభ స్థానానికి ఇలా..!
author img

By

Published : Apr 3, 2021, 11:38 AM IST

ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి ఉపఎన్నిక పోరు ఆసక్తికరంగా సాగుతోంది. తిరుపతిలో పాగా వేయడానికి ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. పార్టీలు తమదైన శైలిలో ప్రచారాలు సాగించినా.. ఎన్నికలు జరిగిన ప్రతీసారి తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఓటర్లు మాత్రం విలక్షణమైన తీర్పు ఇస్తుండడం.. ఆలోచింపజేస్తోంది. ఈ సారి తిరుపతి ఓటరు నాడి ఎలా ఉండబోతోందన్నది.. రాజకీయ వర్గాలతో పాటు.. ప్రజానీకంలోనూ ఆసక్తిని పెంచుతోంది.

సంప్రదాయానికి భిన్నంగా..

సాధారణంగా లోక్‌సభ పరిధిలోని శాసనసభ స్థానాల్లో ఎక్కువ సీట్లను కైవసం చేసుకున్న పార్టీ అభ్యర్థే.. లోక్‌సభ స్థానంలో విజయం సాధిస్తారు. తిరుపతిలో మాత్రం ఈ సంప్రదాయానికి భిన్నంగా పలితాలు వెలువడుతున్నాయి. స్వాతంత్య్రం అనంతరం 1952 నుంచి 1980 వరకు కాంగ్రెస్‌ నేతలు పార్లమెంట్‌ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1983లో తెదేపా ఆవిర్భావం అనంతరం కొంత రాజకీయంగా మార్పులు వచ్చినా లోక్‌సభ స్థానాన్ని మాత్రం ఎక్కువ సార్లు కాంగ్రెస్​ కైవసం చేసుకొంది. నాలుగు సార్లు మినహా తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో పన్నెండు సార్లు కాంగ్రెస్‌ విజయం సాధించగా ఓ సారి తెదేపా, మరోసారి తెదేపా బలపరచిన భాజపా అభ్యర్థి విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు.

తెదేపా ఆవిర్భావం నుంచి 2019 ఎన్నికల వరకు తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో ఎక్కువ స్థానాల్లో తెదేపా అభ్యర్థులు విజయం సాధించినా ఎంపీ స్థానాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, సత్యవేడు, తిరుపతి శాసనసభ స్థానాలతో పాటు నెల్లూరు జిల్లాలోని సుళ్లూరుపేట, సర్వేపల్లి శాసనసభ స్థానాల్లో తెదేపా అభ్యర్థులు విజయం సాధించారు. కానీ ఎంపీ స్థానంలో మాత్రం కాంగ్రెస్‌ అభ్యర్థి చింతా మోహన్‌ విజయం సాధించారు.

1984 నుంచి ఇలా..

తెదేపా ఆవిర్భావం అనంతరం తొలిసారిగా 1984 సంవత్సరంలో ఎన్టీ రామారావు తిరుపతి శాసనసభ స్థానం నుంచి పోటీ చేయగా తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలు తెదేపా అభ్యర్థులు విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన చింతా మోహన్‌ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ పరిధిలోని శాసనసభ స్థానాల్లో తెదేపా అభ్యర్థులు విజయం సాధించినా లోక్‌సభకు మాత్రం కాంగ్రెస్‌ విజయం సాధిస్తూ వచ్చింది. 1989 సాధారణ ఎన్నికలు, 91 మధ్యంతర ఎన్నికలతో పాటు అ తర్వాత జరిగిన 96, 98ల్లో మూడు సార్లు చింతామోహన్‌, ఒకసారి నెలవల సుబ్రమణ్యం కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించారు. 99 ఎన్నికల్లో మాత్రం తెదేపా బలపరచిన భాజపా అభ్యర్థి వెంకటస్వామి ఎంపీగా ఎన్నికయ్యారు.

తిరుపతి లోక్‌సభ పరిధిలోని శాసనసభ ఏడు శాసనసభ స్థానాల్లో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సర్వేపల్లి, సుళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లో తెదేపా అభ్యర్థులు విజయం సాధించిన ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపొందడం విశేషం. 2014 ఎన్నికల్లో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, గూడూరు శాసనసభ స్థానాలలో తెదేపా గెలుపొందినా లోక్‌సభకు వైకాపా అభ్యర్థి వరప్రసాద్‌ గెలుపొందారు.

ఇదీ చదవండి: క్యాన్సర్​ రాకుండా కీరాదోస..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.