ETV Bharat / state

వందేళ్ల చరిత్ర.. ఏదీ భద్రత?

author img

By

Published : Jan 16, 2021, 9:36 AM IST

వందేళ్ల చరిత్ర.. 52 విభాగాలు.. 3.5 లక్షల మంది విద్యార్థులు.. అత్యధిక అఫిలియేటెడ్‌ కళాశాలు.. ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే! అధికారుల నిర్లక్ష్యం.. పర్యవేక్షణ కొరవడటం.. పాలనలో వైఫల్యం.. ఇలా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భద్రత డొల్లగా మారింది. భూములు ఆక్రమణకు గురవుతున్నా.. చెట్లు మాయమవుతున్నా.. సిబ్బంది జీతాల విషయంలో అక్రమాలు వెలుగుచూస్తున్నా కనీసం పట్టించుకున్న పాపానపోవడం లేదు.

వందేళ్ల చరిత్ర.. ఏదీ భద్రత?
వందేళ్ల చరిత్ర.. ఏదీ భద్రత?

నిజాం కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం కోసం సుమారు 2400 ఎకరాలను కేటాయించారు. భూములకు రక్షణ కొరవడంతో ఏకంగా 1200 ఎకరాలకుపైగా ఆక్రమణ చెరలో చిక్కుకుంది. ఏళ్ల తరబడిగా అధికారులు పట్టించుకోక వర్సిటీ చుట్టుపక్కల భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అక్కడక్కడ వర్సిటీ భూములంటూ బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారు. బోర్డులు ఉండగానే ప్రైవేటు వ్యక్తులు భవనాలు నిర్మించుకుంటున్న పరిస్థితి.

వర్సిటీలోంచే రాకపోకలు

ప్రైవేటు వాహనాలు నిత్యం పెద్దసంఖ్యలో వర్సిటీలోంచే రాకపోకలు కొనసాగిస్తున్నాయి. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చాక వర్సిటీ నుంచి రెండువైపులా రాకపోకలు జరగకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ వర్సిటీలోంచి యథేచ్ఛగా రాకపోకలు సాగుతున్నాయి. బాలికల హాస్టల్‌ వెనుకవైపుగేటు, ఆర్టీసీ ఆసుపత్రి వైపు నుంచి ప్రైవేటు వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్న పరిస్థితి. దీంతో వర్సిటీలోకి ఎవరు వస్తున్నారో.. ఎవరు వెళుతున్నారో.. అంతుచిక్కకుండా మారింది. గతేడాది జనవరిలో బాలికల వసతిగృహంలో ప్రైవేటు వ్యక్తి ప్రవేశించిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. అనంతరం భద్రత పెంచి పర్యవేక్షణ పెంచుతామని అధికారులు ప్రకటించినా, తర్వాత పట్టించుకోవడం లేదు.

పెట్రోలింగ్‌ కరవు..

క్యాంపస్‌ ప్రాంతాలపై భద్రతా సిబ్బంది పర్యవేక్షణ కొరవడింది. కనీసం పెట్రోలింగ్‌ వాహనాలు కూడా లేక నిఘా పెట్టలేకపోతున్నారు. దీనికితోడు సిబ్బంది కొరత కూడా ఉంది. వర్సిటీలో 9 బస్తీలున్నాయి. పెద్దసంఖ్యలో ప్రజలు వస్తూ పోతుండటంతో వారంతా బస్తీవాసులో.. కాదో.. తెలియకుండా మారింది.

ప్రహరీ కూలితే అంతే..

వర్సిటీ చుట్టూ ప్రహరీ ఎత్తు తక్కువ. తార్నాక వైపు నుంచి ప్రహరీ దూకి నిత్యం బయటి వ్యక్తులు లోపలికి వెళ్తున్నారు. నాలుగైదుచోట్ల ప్రహరీని ధ్వంసం చేశారు. చెట్లను నరికివేసి కలప బయట అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ప్రహరీ కూలిన వెంటనే నిర్మించకపోవడం ప్రధాన కారణమని విద్యార్థులంటున్నారు.

నిఘా ఎక్కడ..

మూడేళ్ల కిందట వర్సిటీ శత ఉత్సవాల సందర్భంగా విశ్వవిద్యాలయంలోని 50కిపైగా ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తర్వాత వీటి నిర్వహణ కొరవడింది. సాంకేతిక కారణాలతో కెమెరాలు పడకేశాయి. ప్రస్తుతం వర్సిటీలో ఎక్కడా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని విద్యార్థి నాయకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల వర్సిటీలో రెండు గంధం చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే నరికివేశారు. ఇందులో ఒకటి స్వయానా ఉపకులపతి లాడ్జ్‌ వద్దనే చెట్టును నరికినా పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయింది. సీసీ కెమెరాలు లేకపోవడంతో రాత్రిళ్లు పర్యవేక్షణ ఉండటం లేదని విద్యార్థులు విమర్శిస్తున్నారు. అలాగే రాత్రయితే ప్రధాన రహదారితోపాటు వర్సిటీలోని మిగిలిన రహదారుల్లో వీధి దీపాలు వెలగడం లేదు. దీంతో వర్సిటీలో అంధకారం అలముకుంటోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.