ETV Bharat / state

2021లో ప్రపంచ రక్షకుడుగా భాగ్యనగరం.. కొవిడ్​పై యుద్ధభేరి - కొవిడ్​ 19 వ్యాక్సిన్​కు గ్లోబల్​ హబ్​గా హైదరాబాద్

2020.. ఈ సంవత్సరం పేరు వింటే చాలు యావత్​ ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్​- 19 వైరస్​ పేరు గుర్తుకొస్తుంది. అంతగా జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. భవిష్యత్తు కోసం ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఈ సంవత్సరం చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఎంతోమందిని పొట్టన బెట్టుకుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య 2021 నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికి ప్రపంచం సమాయత్తమైంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు హైదరాబాద్​ మహానగరంలో 5 ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్​ను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి.

pharma companies on covid- 19 vaccine manufacture
2021లో కొవిడ్​ 19 వ్యాక్సిన్​కు గ్లోబల్​ హబ్​గా హైదరాబాద్​.!
author img

By

Published : Dec 27, 2020, 6:39 PM IST

కొవిడ్​- 19 విపత్కర పరిస్థితుల మధ్య ప్రపంచమంతా నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికి సిద్ధమైంది. ఈ సమయంలో హైదరాబాద్ మహా నగరం​.. మహమ్మారికి విరుగుడును కనిపెట్టేందుకు సమాయత్తమైంది. నగరంలో 5 వ్యాక్సిన్​ తయారు చేసే సంస్థలు యాంటీ డోట్​ను ప్రవేశపెట్టే పనిలో నిమగ్నమయ్యాయి. భారత్​ బయోటెక్​, బయోలాజికల్​ ఈ లిమిటెడ్(బీఈ)​, అరబిందో ఫార్మా సంస్థలు కరోనా టీకా తయారీలో వివిధ దశల్లో ఉన్నాయి. రెడ్డీస్​ ల్యాబ్​, హెటిరో ఫార్మసీ సంస్థలు వ్యాక్సిన్​ తయారు చేసేందుకు పలు విదేశీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. మరికొన్ని ఫార్మా కంపెనీలు టీకా తయారీకి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి.

మరో వైపు కొవిడ్​ వ్యాక్సిన్​ను ప్రపంచ దేశాలకు రవాణా చేసేందుకు రాజీవ్​ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ముందుకు వచ్చింది. ఈ మేరకు జీఎంఆర్​ హైదరాబాద్​ ఎయిర్​ కార్గో సర్వీస్..​ తన వాటాదారులతో టీకా ఎగుమతులు, దిగుమతులకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపింది. వ్యాక్సిన్​ పురోగతిపై భారత్​ బయోటెక్​, బీఈలను ప్రముఖులు, శాస్త్రవేత్తలు సందర్శించారు. దీన్ని బట్టే టీకాను అందించడంలో హైదరాబాద్​ ముందు వరుసలో ఉందని అర్థం చేసుకోవచ్చు.

'ప్రపంచ దేశాలకు కొవిడ్​- 19 టీకా ఎగుమతులపై మా వద్ద ఇప్పటివరకు ఎటువంటి పాలసీ లేదు. ఎగుమతులకు సంబంధించి ఏ నిర్ణయమైనా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మొదట స్వదేశీ అవసరాలు తీరిన తర్వాతనే తదుపరి నిర్ణయం తీసుకుంటుందని మేము అనుకుంటున్నాం. భారత్​ బయోటెక్​ మినహా మిగతా ఫార్మా సంస్థలు విదేశీ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాయి.'

ఉదయ్​ భాస్కర్​, ఫార్మాఎక్సిల్​ డైరెక్టర్​ జనరల్​

'వ్యాక్సిన్​ తయారీ సంస్థలన్నీ హైదరాబాద్​లో ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏ నిర్ణయం లేదు. టీకా కేటాయింపు నిర్ణయం కేవలం కేంద్రం మాత్రమే తీసుకుంటుంది. ఆ ప్రాతిపదికనే రాష్ట్రాలు వ్యాక్సిన్​ను పొందుతాయి.'

జి. శ్రీనివాసరావు, తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు

మరో టీకా ప్రయోగంలో భారత్​ బయోటెక్​

'కొవ్యాక్జిన్'​ తయారీలో భారత్​ బయోటెక్.. ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్​ రీసర్చ్​, నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీలతో కలిసి పనిచేస్తోంది. ఇదే కాకుండా మరో టీకాను బయటకు తెచ్చేందుకు ప్రయోగాలు ప్రారంభించింది. టీకా పురోగతిని పరిశీలించేందుకు ప్రధాని మోదీ భారత్​ బయోటెక్​ను సందర్శించారు. ల్యాబ్​లో వ్యాక్సిన్​ తయారీకి ఉన్న సౌకర్యాలపై 60 మంది పైగా విదేశీ ప్రతినిధులు కూడా భారత్​ బయోటెక్​లో అధ్యయనం చేశారు. దీంతో పాటు కొవిడ్​- 19 నివారణకు నాసల్​ వ్యాక్సిన్​ను కూడా అభివృద్ధి చేస్తోంది భారత్​ బయోటెక్​. దేశీయంగా తక్కువ ధరలో వ్యాక్సిన్​ సరఫరా చేసేందుకు భారత్​ బయోటెక్​ కృషి చేస్తోందని సీఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు.

బీఈ ఒప్పందం...

బీఈ సంస్థ​.. జాన్​సన్​ ఫార్మాసుటికా ఎన్వీతో వ్యాక్సిన్​ తయారీపై ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం క్లినికల్​ ట్రయల్స్​లో ఫేజ్​ మొదటి దశలో ఉంది. తక్కువ ధరలో టీకా తయారీతోపాటు, పిల్లల్లో సహజమైన రోగ నిరోధక శక్తిని పెంపొందించే టీకా అభివృద్ధితో పాటు, భవిష్యత్తులో కొవిడ్-19 నివారణ టీకా తయారీకి 'బీఈ'కి రూ.220 కోట్ల రుణం ఇచ్చేందుకు ఇంటర్నేషనల్ ఫైనాన్స్​ కార్పొరేషన్​ ముందుకొచ్చింది.

విదేశీ కంపెనీలతో అరబిందో ఒప్పందం

2021 ఏప్రిల్​- మే నెలలో వ్యాక్సిన్​ను అందించాలని అరబిందో ఫార్మా సంస్థ యోచిస్తోంది. కొవిడ్​- 19తో పాటు వివిధ రకాల వైరస్​ వ్యాధులకు టీకాను అందించేందుకు ఈ సంస్థ దాదాపు రూ. 275 కోట్ల పెట్టుబడితో యూనిట్ నెలకొల్పనుంది. సీసీఎంబీకి చెందిన దేశంలోని వివిధ ల్యాబ్​ల్లో వివిధ సాంకేతిక పరికరాల ద్వారా వ్యాక్సిన్​ అభివృద్ధి జరుగుతోందని సీఎస్​ఐఆర్​కు చెందిన సీనియర్ శాస్త్రవేత్త పేర్కొన్నారు. సెంటర్ ఫర్ సెల్యూలార్​(సీసీఎంబీ), చండీగఢ్​​లోని ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ టెక్నాలజీ, కోల్​కతాలోని ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ కెమికల్​ బయోలజీలు సంయుక్తంగా ఓ టీకాను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ టీకా క్లినికల్​ అభివృద్ధి, పంపిణీ బాధ్యతను అరబిందో ఫార్మా చేపట్టింది. మరోవైపు అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ కొవ్యాక్స్​ తో సైతం అరబిందో ఫార్మా.. భారత్, యూనిసెఫ్ చిల్డ్రన్ ఫండ్ సంస్థ యూబీ- 612 వ్యాక్సిన్​ అభివృద్ధి, తయారీ, వాణిజ్యీకరణకు ఒప్పందం కుదుర్చుకుంది.

డోస్​లను అందించే హక్కులు

హిమాచల్​లోని సెంట్రల్​ డ్రగ్స్​ ల్యాబొరేటరీ నుంచి క్లియరెన్స్​ పొందిన రెడ్డీస్​ ల్యాబొరేటరీస్​, రష్యన్​ డైరెక్ట్​ ఇన్వెస్ట్​మెంట్​ ఫండ్​(ఆర్డీఐఫ్​) లు ప్రస్తుతం 'స్పుత్నిక్​ వీ వ్యాక్సిన్'​ రెండో దశ క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహిస్తున్నాయి. గత సెప్టెంబర్​లో ఈ టీకా క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించేందుకు ఈ సంస్థలు భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత్​లో మొదటి 10 కోట్ల​ డోస్​లను పంపిణీ చేసేందుకు సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీ నుంచి అనుమతి పొందాయి.

ఫార్మా మేజర్​ సంస్థ హెటిరో సైతం ఆర్డీఐఫ్​తో దేశంలో సంవత్సరానికి 10 కోట్ల డోస్​లు అందించేలా ఒప్పందం కుదుర్చుకుంది.

భాగ్యనగరం కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఫార్మా సంస్థలు కొవిడ్​-19 వైరస్​ నిరోధానికి వినియోగిస్తున్న రెమిడెసివిర్​, ఫావిపిర్రవిర్ మందుల తయారీకి, ఆయా ఔషధాల ఫార్ములాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఇదీ చదవండి: 'నిరుపేదల సొంతింటి కల తెరాస ప్రభుత్వంతోనే సాధ్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.