ETV Bharat / state

ఆ నదిలో బాణలింగాలు దొరుకుతాయి! - ఈనాడు సండే మ్యాగజైన్

‘బ్రహ్మ మురారి సురార్చిత లింగం...  నిర్మలభాసిత శోభిత లింగం...’ అంటూ భక్తి పూర్వకంగా లింగాష్టకం చదువుతూ ఆ శివలింగాన్ని అభిషేకిస్తుంటారు భక్తులు. పవిత్రమైన ఆ శివలింగాలు ఐదు రకాలు... అవే స్వయంభూ, దైవిక, రుష్య, మానుష, బాణలింగాలు. వీటన్నింటిలోకీ నర్మదానదిలో సహజంగా లభించే బాణలింగాలు సర్వ శ్రేష్ఠమైనవి అనేది పౌరాణిక కథనం. దీర్ఘవృత్తాకారపు రాళ్ల  రూపంలో లభ్యమయ్యే ఈ లింగాలను శివరూపానికే ప్రతిరూపంగానూ మహిమాన్వితమైనవిగానూ భావిస్తారు భక్తులు.

story behind the lord shiva According to the Shiva Purana, Lord Shiva appeared in the form of a linga around midnight.
ఆ నదిలో... బాణలింగాలు దొరుకుతాయి!
author img

By

Published : Mar 11, 2021, 10:06 AM IST

Updated : Mar 11, 2021, 11:24 AM IST

మాఘ బహుళ చతుర్దశినాడు వచ్చేదే మహాశివరాత్రి. శివపార్వతుల కళ్యాణం జరిగిన శుభదినం. దీనికి మరో విశిష్టతా ఉంది. ఆనాటి అర్ధరాత్రి సమయంలోనే శివుడు లింగాకారంలో ఆవిర్భవించాడనేది శివపురాణ కథనం. అందుకే ఆ పరమేశ్వరుణ్ణి లింగరూపంలో అర్చిస్తుంటారు భక్తులు. అయితే ఆ లింగాలన్నింటిలోకీ నర్మదానదిలో లభ్యమయ్యే బాణలింగాలు శక్తిమంతమైనవనీ, పాపాలను పోగొడతాయనీ, కోటి శివలింగాల్ని అర్చించినా దొరకని పుణ్యం ఒక్క బాణలింగాన్ని పూజిస్తే లభిస్తుందనీ యాజ్ఞవల్క్యసంహిత పేర్కొంటోంది.
బాణాసురుడు పరమ శివభక్తుడు. మహా తపస్సంపన్నుడు. ప్రహ్లాదుడి మనుమడు. శివునికై నర్మదా నదీతీరంలో కఠోర తపస్సు చేసి, ఆయన్ని ప్రసన్నం చేసుకుని, లింగ రూపంలో తపోభూమిలో ఉండమని కోరాడట. ఆ వర ప్రభావంవల్ల నర్మదానదిలో ఉద్భవించిన లింగాలే బాణలింగాలు... భక్తులకు కైవల్యాన్ని ప్రసాదించడానికి సదాశివుడు భువిపై అవతరించిన శిలారూపాలు.

నర్మదా తీరం

తాంత్రిక లింగం!
శివుడు కాలరుద్రుడై నర్తించే సమయంలో ఆయన శరీరం నుంచి రాలిపడ్డ స్వేదమే నర్మదా నదిగా మారి ప్రవహించిందనీ ఆ నదిలో దొరికే రాళ్లు శివుడికి ప్రతిరూపాలని వాయు, స్కంద పురాణాలు పేర్కొంటున్నాయి. నర్మదానదిని శంకరుడి పుత్రి అన్న అర్థంలో శంకరీ అనీ పిలుస్తుంటారు.
కోలాకారంలో నున్నగా మెరుస్తూ నదిలో లభ్యమయ్యే ఈ లింగాలనే తాంత్రిక లింగాలనీ పిలుస్తారు. శివ, శక్తి రూపాల కలయికతో ఏర్పడినవిగా భావించి సాధువులు తాంత్రిక శక్తుల్లోనే కాదు, నాడులూ రక్తనాళాల్లోని అవరోధాల్ని తొలగించేందుకూ వీటిని ఉపయోగిస్తారు. ఈ లింగం వ్యతిరేక శక్తుల్ని పోగొడుతుందనీ, శరీరంలోని శక్తిచక్రాలను ప్రేరేపించి వ్యాధుల్ని తగ్గి స్తుందనీ చెబుతారు. బాణలింగాలు గులకరాళ్లు కావనీ, ఐరన్‌ ఆక్సైడ్‌, జియోథైట్‌, బసాల్ట్‌, ఎగేట్‌ కలిసిన క్రిప్టోక్రిస్టలైన్‌ క్వార్ట్జ్‌అనే అరుదైన రత్నాలనీ, కోటీ 40 లక్షల సంవత్సరాల క్రితం ఉల్క ఏదో రాలిపడి, ఇక్కడి మట్టీ నీటితో కలిసి అరుదైన సమ్మేళనంగా రూపొంది ఉంటుందనీ, అందుకే ఇవి దృఢమైనవీ శక్తిమంతమైనవీ అంటారు జియాలజిస్టులు.

వివిధ రకాల బాణలింగాలు

వేసవిలో నదీప్రవాహం తగ్గిన సమయంలో- సంప్రదాయ వేడుక చేసి, చుట్టుపక్కల గ్రామాలకు చెందినవాళ్లు ఈ రాళ్లను సేకరించి, మట్టి, పేడ, నూనెలు, ఔషధ మూలికలు, మైనం కలిపిన ఓ ప్రత్యేక మిశ్రమంతో సానబెడతారట. రాళ్లలో సహజంగా ఏర్పడిన చారలు బయటకుకనిపించే వరకూ ఇలా చేస్తారట. ఈ గుర్తులను శివ సంకేతాలుగా భావిస్తారు. బాణలింగాలు రకరకాల సైజుల్లో దొరుకుతుంటాయి. వీటిని సేకరించి సానబెట్టే హక్కులు కూడా కొన్ని వర్గాలకే ఉంటాయట. అయితే ఈమధ్య కొందరు అలాగే ఉండే రాళ్లను సేకరించి చెక్కి అవే బాణలింగాలుగా అమ్ముతున్నారు. కానీ రాళ్లమీద సహజంగా ఏర్పడిన చారలూ మచ్చలూ ఉంటేనే బాణలింగాలుగా గుర్తించాలి. ఇక్కడ దొరికిన బాణలింగాన్నే రాజరాజచోళుడు బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠించాడట. కశ్మీరులోని ఆదిశంకరా చార్యుల ఆలయంలో ఉన్నదీ బాణలింగమే. ‘ఓం నమశ్శివాయ’ అన్న పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తేనే కోరిన వరాలిచ్చే ఆ బోళాశంకరుడు, శివశక్తులతో రూపొందిన బాణలింగాన్ని భక్తితో కొలిస్తే ముక్తిని ప్రసాదిస్తాడనేది శివారాధకుల విశ్వాసం.

బాణ లింగం

ఇదీ చదవండి: ఓ స్నేహం.. కారు డ్రైవర్‌ను కోటీశ్వరుణ్ణి చేసింది!

Last Updated : Mar 11, 2021, 11:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.