శివాజీ విగ్రహం ఆవిష్కరించిన గాలి నిజామాబాద్ జిల్లాలో శివాజీ జయంతి రోజు.. అనుకోని పరిస్థితుల్లో ఆయన విగ్రహం ఆవిష్కృతమైంది. ఖానాపూర్లోని భాగ్యనగర్ చౌరస్తాలో ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న శివాజీ విగ్రహంపై కప్పి ఉంచిన కవర్ గాలికి లేచిపోయింది. విగ్రహ ఆవిష్కరణ అయ్యిందని స్థానికులు సంతోషంతో నినాదాలు చేశారు. అనంతరం విగ్రహంపై కవర్ కప్పారు. ఈ నెలాఖరులో స్థానిక ఎమ్మెల్యేతో విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు చేశారు.
ఇవీ చదవండి:అతివలకు అవకాశం ఎప్పుడు?