ETV Bharat / state

Vinod Kumar allegations on BJP: ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే బడ్జెట్​లో నిధులు: వినోద్‌కుమార్‌ - తెలంగాణ టాప్ న్యూస్

Vinod Kumar allegations on BJP: ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే బడ్జెట్​లో భారీగా నిధులు కేటాయించారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆరోపించారు. అంబేడ్కర్‌ కల్పించిన హక్కులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. కేంద్రం ఏ విషయంలోనూ రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Vinod Kumar allegations on BJP, vinod on budget
ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే బడ్జెట్​లో నిధులు : వినోద్‌కుమార్‌
author img

By

Published : Feb 2, 2022, 12:38 PM IST

Updated : Feb 2, 2022, 2:07 PM IST

Vinod Kumar allegations on BJP: రాజ్యాంగం, పనితీరును సమీక్షించేందుకు వాజ్ పేయీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కమిషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గుర్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సూచించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని... రాష్ట్రాల హక్కులను హరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రాలతో చర్చించకుండా నదుల అనుసంధానం చేపడతామని బడ్జెట్లో ఎలా చెబుతారని వినోద్ ప్రశ్నించారు. గోదావరిలో మిగులు జలాలు ఉంటే తెలంగాణ ప్రాజెక్టులకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదన్న ఆయన... అనుసంధానం కోసం డీపీఆర్ తయారు అయిందనడాన్ని కొట్టి పారేశారు.

ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని నిర్వీర్యం చేసేందుకు యత్నం

ప్రధానమంత్రికి కొన్ని అంశాలపై మాత్రమే అధికారం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే దేశ సమగ్రతకు భంగం కలుగుతుందని గతంలో ఉన్న చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారని తెలిపారు. హైదరాబాద్​లోని ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని నిర్వీర్యం చేసేందుకు మోదీ సర్కార్ యత్నిస్తోందని... హైదరాబాద్ ప్రజలు దీన్ని గుర్తించాలని సూచించారు. భాజపాను ఉత్తర భారతదేశ పార్టీగా వినోద్ కుమార్ అభివర్ణించారు. రాజ్యాంగ మౌలికస్వరూపాన్ని మార్చరాదని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చిందని... మారిన పరిస్థితులకు అనుగుణంగా మార్పులు జరగాలని, ఈ విషయాన్ని అంబేడ్కర్ స్వయంగా చెప్పారని వినోద్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, గవర్నర్ల పాత్రపై చర్చ జరగాల్సి ఉందన్న ఆయన.... గవర్నర్లు నేరుగా దరఖాస్తులు తీసుకుంటున్నారని, మమతా బెనర్జీపై పశ్చిమ బంగ గవర్నర్ ట్వీట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే భారీగా నిధులు ఇచ్చారు. అంబేడ్కర్ రచించిన గొప్ప రాజ్యంగం మొదటి పేజీ ఏం చెబుతోంది. ఆర్టికల్ 1 ఏం చెబుతోంది. వీళ్లు అట్లా ఉన్నరా? కావేరీ లోకి నీళ్లు ఎలా తీసుకెళ్తారు? తెలంగాణను ఎండబెట్టి తీసుకెళ్తారా? ఇవాళ రాష్ట్రాలతో మాట్లాడకుండా ప్రకటనలు చేస్తున్నారు. కేంద్రం ఏ విషయంలోనూ రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకోవట్లేదు.

-వినోద్‌కుమార్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు

ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే బడ్జెట్​లో నిధులు : వినోద్‌కుమార్‌

ఇదీ చదవండి: New Judges to TS High court : తెలంగాణ హైకోర్టుకు 12 మంది జడ్జిల నియామానికి కొలీజియం సిఫార్సు

Last Updated : Feb 2, 2022, 2:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.