ETV Bharat / state

'శాటిలైట్ టౌన్​షిప్ లేదా ఆఫ్ క్యాంపస్ వెంటనే ఏర్పాటు చేయాలి'

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఛైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్‌... కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్‌కు ఓ లేఖ రాశారు. కరీంనగర్ లేదా వరంగల్ ఉమ్మడి జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన శాటిలైట్ లేదా ఆఫ్ క్యాంపస్ వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు.

author img

By

Published : Mar 23, 2021, 9:03 PM IST

'శాటిలైట్ లేదా ఆఫ్ క్యాంపస్ వెంటనే ఏర్పాటు చేయాలి'

  • Wrote a letter to Hon’ble Union Education Minister Sri @DrRPNishank Ji to request to kindly take up the issue with the government of India and ensure the setup of the university of Hyderabad satellite campus pic.twitter.com/NyvDOxNMeH

    — B Vinod Kumar (@vinodboianpalli) March 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాష్ట్రంలో కరీంనగర్ లేదా వరంగల్ ఉమ్మడి జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన శాటిలైట్ షిప్ లేదా ఆఫ్ క్యాంపస్ వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఛైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్‌ కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్‌కు ఓ లేఖ రాశారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్యాపరంగా చేయూత అందించాల్సిన గురుతర బాధ్యత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉపకులపతికి ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం 1969లో ప్రారంభమైన తొలిదశ తెలంగాణ పోరాట నేపథ్యంలో ఉద్యమ జ్వాలలు చల్లార్చి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (ఈ) అనుసరించి 1973లో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు.

తొలిదశ ఉద్యమ సందర్భంగా తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు ఉన్నతమైన డిగ్రీ, పీజీ విద్య అందించేందుకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నెలకొల్పారని గుర్తు చేశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆవిర్భవించి దాదాపు నాలుగున్నర దశాబ్దాలు గడుస్తున్నా... ఇప్పటికీ ఆ లక్ష్యం నెరవేరలేదని వినోద్ కుమార్ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీలకు చెందిన ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు గౌడ్ కిరణ్‌కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ కేతన్, ప్రతినిధులు అంజయ్య, పవన్ నాయక్ తదితరులు వినోద్‌కుమార్‌ను మంత్రుల నివాసంలో కలిసి ఓ వినతి పత్రం అందజేశారు.

ఇవీచూడండి: 'అమరులను స్మరించుకునేందుకే ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.