ETV Bharat / state

సీతారామ ప్రాజెక్టు వ్యయం రూ.18,900 కోట్లు - telangana state irrigation department

Sitarama Project expenditure : సీతారామ ఎత్తిపోతల పథకం సవరించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖ కేంద్ర జలసంఘానికి అందజేసింది. సీతమ్మసాగర్‌ బ్యారేజీ, సీతారామ ఎత్తిపోతల పథకం కింద అదనపు ఆయకట్టు సహా అన్నింటితో కలిపి రూ.18,900 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన డీపీఆర్​ను సీడబ్ల్యూసీకి సమర్పించింది. దీంతో ఈ పథకానికి అవసరమైన అనుమతుల ప్రక్రియను కేంద్ర జల సంఘం మళ్లీ చేపట్టనుంది.

seetarama project
seetarama project
author img

By

Published : Feb 15, 2023, 1:41 PM IST

సీతారామ ప్రాజెక్టు వ్యయం రూ.18,900 కోట్లు

Sitarama Project expenditure : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లో 3.29 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 3.45 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ. వెరసి 6.74 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే లక్ష్యంతో రూ.13,058 కోట్లతో సీతారామ ఎత్తిపోతలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 70 టీఎంసీల నీటి వినియోగంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా పంపుహౌస్‌లు, ప్రధాన కాలువల పనులను ప్రారంభించింది.

Sitarama Project Cost : ఇప్పటివరకు సుమారు రూ.6,500 కోట్లు ఖర్చుచేసింది. డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పథకానికి కేంద్ర జల సంఘం నుంచి అంతర్‌ రాష్ట్ర అనుమతి సహా అటవీ, పర్యావరణ తదితర అనుమతులు వచ్చాయి. ఆ సమయంలో జలసంఘం ప్రాజెక్టు అంచనాను రూ.11,300 కోట్లకు తగ్గించడంతోపాటు నీటి వినియోగాన్ని 65.25 టీఎంసీలకు పరిమితం చేసింది.

ఇదే సమయంలో ఈ ప్రాజెక్టులో భాగంగానే దుమ్ముగూడెం ఆనకట్టకు దిగువన రాష్ట్ర ప్రభుత్వం సీతమ్మసాగర్‌ బ్యారేజీ నిర్మాణాన్ని రూ.3,482 కోట్లతో చేపట్టింది. 67 గేట్లతో 36.57 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా నిర్మించడంతోపాటు 280 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇటీవల ప్రభుత్వం ఇల్లెందు, వైరా, పినపాక నియోజకవర్గాల్లో లక్షా 13 వేల ఎకరాల్లో కొత్త ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించడంతో మొత్తం ఆయకట్టు 7.87 లక్షల ఎకరాలకు పెరిగింది. ఈ నేపథ్యంలో దీనికి అనుమతుల సమయంలో జలసంఘం కొర్రీలు వేయడంతోపాటు రెండింటి డీపీఆర్​లు సమర్పించాలని కోరింది.

తాజా సవరణ డీపీఆర్‌లో జలసంఘం ఆమోదించిన 65.25 టీఎంసీలతోనే ఆయకట్టు మొత్తానికి నీరు సరఫరా చేస్తామని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ప్రతిపాదించారు. సీతారామ ఎత్తిపోతల, సీతమ్మసాగర్‌ బ్యారేజీ నిర్మాణ వ్యయంతోపాటు కొత్తగా మూడు నియోజకవర్గాల్లో ఇచ్చే ఆయకట్టు పనులకు రూ.2,900 కోట్లు, 280 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు కలిపి మొత్తం రూ.18,900 కోట్లు వ్యయం అవుతుందని పేర్కొన్నారు.

సవరించిన డీపీఆర్​ను జలసంఘం ఆంధ్రప్రదేశ్‌ సహా ఇతర రాష్ట్రాలకుూ పంపనుంది. అంటే ప్రధాన అనుమతులన్నీ మళ్లీ తీసుకోవాల్సి ఉంటుంది. గతంలోనే అన్ని అనుమతులు వచ్చినందున సవరించిన డీపీఆర్​ ఆమోదానికి ఎక్కువ సమయం పట్టదని, మూడు నెలల్లోనే అన్ని అనుమతులు వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.