ప్రధానమంత్రి స్వానిధి పథకం కింద బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే రుణాలకు స్టాంపు డ్యూటీని మినహాయింపును పొడగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఈ పథకం కింద రుణాలు తీసుకునే వీధి వ్యాపారులకు స్టాంపు డ్యూటీని గతంలో మినహాయించారు. ఆ గడువు 2020 డిసెంబర్ నెలాఖరుతో ముగిసింది.
అయితే పథకం ఇంకా కొనసాగుతుండడం, వీధి వ్యాపారులకు రుణాలు ఇస్తున్న తరుణంలో స్టాంపు డ్యూటీ మినహాయింపు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడగించింది. అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. పథకంతో పాటే స్టాంపు డ్యూటీ మినహాయింపు కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: అన్ని విధాలా అండగా ఉంటాం: సీఎం కేసీఆర్