రాష్ట్రంలో ఆవిర్భావం దినోత్సవ వేడుకలు సాదాసీదాగా జరిగాయి. హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద అమరవీరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం ప్రగతిభవన్‌లో తెలంగాణతల్లి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి.... జాతీయ జెండా ఆవిష్కరించారు.
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అమరవీరుల త్యాగ ఫలితంగా సిద్ధించిన తెలంగాణ..... అభివృద్ధి పథంలో నడుస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బీఆర్‌కే భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పాల్గొన్నారు.
గత 70 ఏళ్లలో జరగని ప్రగతి ఏడేళ్లలో చేసి చూపించామని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరుల త్యాగాలు, ప్రజా పోరాటాలు ఫలితంగా స్వరాష్ట్రం సాధ్యమైందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా రంగదాంపల్లి చౌరస్తాలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఉద్యమం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ఉత్సవాల్లో.... విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అన్నిరంగాల్లో ప్రగతిని సాధిస్తూ... దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు. నిజామాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సంగారెడ్డిలో మహమూద్ అలీ, మేడ్చల్ జిల్లాలో మల్లారెడ్డి, వరంగల్‌లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు..
ఇదీ చూడండి: Governor thamilisi: అమర వీరులకు గవర్నర్ తమిళిసై నివాళి