ETV Bharat / state

'సమాచారలోపంతోనే ఆ ప్రచారం.. విశాఖే ఏపీ రాజధాని'

MINISTER BUGGANA ON AP CAPITAL: ఏపీకి మూడు రాజధానులు ఉన్నాయన్న అంశం పూర్తిగా తప్పుడు సమాచారమని.. రాష్ట్ర పాలన అంతా విశాఖ నుంచే నిర్వహించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన తెలిపారు. జీఐఎస్​ ప్రచారంలో భాగంగా పెట్టుబడుదారులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

MINISTER BUGGANA ON AP CAPITAL
MINISTER BUGGANA ON AP CAPITAL
author img

By

Published : Feb 14, 2023, 10:31 PM IST

MINISTER BUGGANA ON VISAKHA CAPITAL: గ్లోబల్ ఇన్వెస్ట్​మెంట్​ సమ్మిట్ ప్రచారంలో భాగంగా బెంగుళూరులో నిర్వహించిన రోడ్ షోలో విశాఖ రాజధాని అంశంపై మంత్రులను పెట్టుబడిదారులు పలు రకాల ప్రశ్నలు అడిగారు. విశాఖ పైనే ఎందుకు దృష్టి పెట్టారు.. పారిశ్రామిక గ్రోత్ ఏరియాగా తిరుపతి, విజయవాడలను ఎందుకు ఎంచుకోలేదని ఆర్థిక మంత్రి బుగ్గనను పెట్టుబడిదారులు ప్రశ్నించారు.

ఐటీ పరిశ్రమలు, సంబంధిత పెట్టుబడులను విశాఖకు ఆకర్షించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. విశాఖలో ఐటీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఐటీ పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. దీంతో పాటు తమ ప్రభుత్వం ఏపీ తదుపరి రాజధానిగా విశాఖనే నిర్ణయించిందని బుగ్గన స్పష్టం చేశారు.

ఏపీకి మూడు రాజధానులు ఉన్నాయన్న అంశం పూర్తిగా తప్పుడు సమాచారమన్న ఆయన.. రాష్ట్ర పాలన అంతా విశాఖ నుంచి నిర్వహించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత పాలనా రాజధానిగా విశాఖనే ఎంచుకోవడానికి కారణం.. అతి తక్కువ వ్యయంలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయనేనని తెలిపారు. రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందేందుకూ విశాఖలో అవకాశం ఉందని అన్నారు. అక్కడి వాతావరణంతో పాటు పోర్టులు, పరిశ్రమలు ఉన్నాయి కాబట్టే విశాఖను రాజధానిగా ఎంచుకున్నామని మంత్రి వివరించారు.

కర్నూలు అనేది రాజధాని కాదని.. అక్కడ కేవలం హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే గుంటూరులోనూ అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేయాలన్నది తమ నిర్ణయంగా పేర్కొన్నారు. గతంలో ఎప్పుడో జరిగిన శ్రీబాగ్ ఒప్పందం మేరకు మూడు ప్రాంతాల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరుపతి ప్రపంచానికే ఆధ్యాత్మిక రాజధాని అని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

రాష్ట్ర విభజన సమయంలో నష్టపోయిన ఏపీ: రాష్ట్ర విభజన సమయంలో ఏపీ నష్టపోయిందని.. అందుకే పారిశ్రామికంగా ఎదిగేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలను ఆహ్వానిస్తున్నామని మంత్రి బుగ్గన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు కేవలం హైదరాబాద్​లోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయని.. జాతీయ సంస్థలను ఏర్పాటు చేశాయని తెలిపారు. అక్కడ పెద్ద ఎత్తున భూమి కూడా అందుబాటులో ఉండటంతో హైదరాబాద్​లో భారీ పరిశ్రమలు, రక్షణ రంగ సంస్థలు వచ్చాయన్నారు.

ఏపీలో మూడు కారిడార్లు: ప్రముఖ ఐటీ , ఉత్పత్తి సంస్థలు కూడా మొదటి ఉత్పత్తిని బెంగుళూరులోనే ప్రారం భించాయని గుర్తు చేశారు. అందుకే హైదరాబాద్​, బెంగుళూరు లాంటి పెద్ద నగరాలు దేశంలోనే ప్రముఖంగా నిలిచాయని పేర్కొన్నారు. విశాఖ- చెన్నై, చెన్నై- బెంగుళూరు, బెంగుళూరు- హైదరాబాద్ కారిడార్​లు ఏపీ నుంచి వెళ్తున్నాయన్న మంత్రి.. ఈ మూడు కారిడార్​లలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు నీరు, విద్యుత్, భూమి, విమానాశ్రయం లాంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.

ఏపీలో అంతర్గత జల రవాణా మార్గాలు: విశాఖ లాంటి అందమైన నగరాలు ప్రపంచంలోనే అరుదుగా ఉన్నాయని.. హైదరాబాద్, బెంగుళూరు లానే అది కూడా కాస్మోపాలిటన్ నగరంగా మారుతోందని తెలిపారు. ఐటీ రంగంలో విశాఖలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం విద్య, సంక్షేమ కార్యక్రమాలు, నైపుణ్యంపై దృష్టి పెట్టి వాటిపై ఎక్కువ వ్యయం చేసిందని తెలిపారు. మూడు పారిశ్రామిక కారిడార్​లతో పాటు 888 కిలో మీటర్ల అంతర్గత జల రవాణా మార్గాలు కూడా ఉన్నాయన్నారు. 2029 వరకూ 10 మిలియన్ టన్నుల కార్గోను అంతర్గత జల రవాణా మార్గాల ద్వారా రవాణా చేసేలా ప్రణాళికలు చేశామన్నారు.

9 గిగావాట్ల సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తి సామర్ధ్యం ఏపీకి ఉందని వెల్లడించారు. భవిష్యత్​లో 38 గిగావాట్ల సామర్థ్యానికి చేరుకుంటామన్న ఆయన.. అలాగే 5 వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులను కూడా ప్రారంభించామని తెలిపారు. 176 నైపుణ్యాభివృద్ధి సంస్థలు రాష్ట్రంలోని యువతకు ప్రస్తుతం నైపుణ్యాన్ని అందిస్తున్నాయని గుర్తు చేశారు. ఇబ్బందులు లేని వ్యాపార, వాణిజ్య వాతావరణాన్ని రూపకల్పన చేయాలన్నదే ఏపీ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.