ETV Bharat / state

ఈనెల 13 తర్వాత ఎప్పుడైనా జీహెచ్​ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్​ : ఎస్​ఈసీ - జీహెచ్​ఎంసీ ఎన్నికల రిటర్నింగ్​ అధికారుల శిక్షణ కార్యక్రమం

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సన్నాహక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 13న ఓటర్ల తుదిజాబితా ప్రకటించిన తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ జారీ చేయవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు.

ఈనెల 13 తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్​ రావొచ్చు: ఎస్​ఈసీ

author img

By

Published : Nov 3, 2020, 6:41 PM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహక ప్రక్రియ ప్రారంభమైందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ పార్థసారథి తెలిపారు. ఎన్నికల్లో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించే వారికి శిక్షణ ఇచ్చే ట్రైనర్ల శిక్షణా శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియలో రిటర్నింగ్ అధికారి పాత్ర అత్యంత ప్రాధాన్యమైందని ఎస్​ఈసీ పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారులు పారదర్శకంగా, తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాలని, ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.

జీహెచ్ఎంసీ పరిధిలో 150 వార్డులకు 150 మంది రిటర్నింగ్ అధికారులు, 150 లెక్కింపు కేంద్రాలు ఉంటాయని తెలిపారు. సగటున ఒక్కో వార్డుకు 50 పోలింగ్ కేంద్రాలు ఉంటాయని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో వీడియో, వెబ్​క్యాస్టింగ్​కు ఏర్పాట్లు చేయాలని పార్థసారథి సూచించారు. విశాలంగా, మంచి వెలుతురు, ఇంటర్నెట్ సదుపాయం ఉన్న పోలింగ్ కేంద్రాన్ని ఎంపిక చేసి ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీకి ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఇదీ చూడండి: వరద బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి సాయం అందిస్తాం: మంత్రి తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.