ETV Bharat / state

సీబీఎస్​ఈ తరహాలో రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు..?

సీబీఎస్​ఈ విద్యా తరహా విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయడంపై సాధ్యాసాధ్యాలను విద్యాశాఖ పరిశీలిస్తోంది. కొత్త విద్యా సంవత్సరం 2021-22లో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై.. పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. సీబీఎస్​ఈ విధానాన్ని స్వల్ప మార్పులు చేర్పులతో రాష్ట్రంలో అమలు చేయడంపై రాష్ట్ర విద్యా పరిశోధన-శిక్షణా మండలి, ప్రభుత్వ పరీక్ష విభాగం బోర్డు అధికారులు కసరత్తులు చేస్తున్నారు.

సీబీఎస్​ఈ తరహాలో రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు..?
సీబీఎస్​ఈ తరహాలో రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు..?
author img

By

Published : Jul 23, 2021, 4:52 AM IST

విద్యార్థుల అభ్యాసన ఫలితాల మదింపు విధానంలో సమూల మార్పులు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. తూతూ మంత్రంగా పరీక్షలు జరిపి.. ఇష్టారాజ్యంగా మార్కులు, గ్రేడ్లు, ఇవ్వవద్దని.. ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ ఆయా రాష్ట్రాలకు సూచించింది. ఈ క్రమంలోనే సీబీఎస్​ఈ ఈసారి విద్యా సంవత్సరాన్ని.. టర్మ్-1, టర్మ్-2లుగా విభజించి.. రెండుసార్లు బోర్డు పరీక్షలు జరుపుతామంది. తొలి 6 నెలల పరీక్ష.. నవంబర్-డిసెంబర్​లో సగం సిలబస్​కు నిర్వహించాలని చూస్తోంది. ఇవి బహుళ ఐచ్ఛిక ప్రశ్నల రూపంలో ఉంటాయని తెలిపింది. రెండో దశ పరీక్ష మిగిలిన సగం సిలబస్​కు నిర్వహిస్తామంది. ఈ రెండింటిలో వచ్చిన మార్కులను.. పరిగణలోకి తీసుకుని తుది ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొంది.

సీబీఎస్​ఈ ప్రకటించినట్లుగా రాష్ట్రంలోనూ రెండుసార్లు బోర్డు పరీక్షలు జరిపే విధానం సాధ్యాసాధ్యాలపై అధికారులు చర్చిస్తున్నారు. సాధారణంగా నాలుగు ఫార్మాటివ్ అసెస్మెంట్లు, ఒక సమ్మెటివ్ అసెస్మెంట్.. ఎస్​ఏ-1తో పాటు.. వార్షిక పరీక్షలు ఎస్​ఏ-2 జరుపుతారు. అయితే.. గత రెండేళ్లుగా వార్షిక పరీక్షలు జరగలేదు. గత విద్యా సంవత్సరం 2020-21 ఎస్​ఏ-1 ఆధారంగా పదో తరగతి గ్రేడ్లు ఇచ్చారు. సాధారణంగా ఎస్​ఏ-1ను జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు ప్రశ్నాపత్రాలు తయారు చేసి పంపిస్తుంది. ఈసారి సీబీఎస్​ఈ మాదిరిగానే.. వాటిని బోర్డు తయారు చేసి పంపిస్తే.. ఎలా ఉంటుందనే దానిపై అధికారులు ఆలోచన చేస్తున్నారు.

మరో పక్క రాష్ట్రవ్యాప్తంగా ఒకే ప్రశ్నాపత్రం ఉంటేనే.. తుది పరీక్షలకు వెయిటేజీ ఉండడంలో హేతుబద్ధత ఉంటుందని కొందరు సూచిస్తున్నారు. వచ్చే నవంబర్-డిసెంబర్ వరకు ప్రత్యక్ష బోధన లేకుంటే.. అప్పుడు ఇళ్ల నుంచే ఆన్​లైన్​, ఆఫ్​లైన్​ పరీక్షలు జరపాలని.. సీబీఎస్​ఈ నిర్ణయించింది. అది రాష్ట్రంలో సాధ్యపడుతుందా..? అన్న ప్రశ్న అధికారుల్లో తలెత్తుతుంది. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. త్వరలో ఎస్​సీఈఆర్​టీ, ఎస్​ఎస్​సీ బోర్డు అధికారుల సమావేశం ఉంటుందని.. అందులో వీటి గురించి చర్చిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: HYD Rains: ముసురుపట్టిన భాగ్యనగరం.. మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.