వైద్యారోగ్య శాఖలో ఖాళీలను రెగ్యులర్ విధానంలో భర్తీ చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను రాష్ట్ర డాక్టర్ల ఫోరం కోరింది.
కరోనా విపత్తు సమయంలోనూ ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్టు విధానం ద్వారా సేవలు అందిస్తున్న వైద్యులను గుర్తించి.. క్రమబద్ధీకరించేలా చూడాలని విన్నవించారు. ఈ మేరకు కోఠిలోని డీఎంఈ కార్యాలయంలో మంత్రికి వినతి పత్రం అందజేశారు.
కొవిడ్-19 విజృంభిస్తున్నా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నామని ఫోరం కన్వీనర్ డాక్టర్ రాజ్‌కుమార్ జాదవ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృషిలో ఉంచుకుని.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని విన్నవించారు.
ఇప్పటికే ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కాంట్రాక్టు విధానంలో సేవలు అందిస్తున్న వైద్యులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.