పురపాలక ఎన్నికలపై హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నేతలు సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా, ఎంపీ రేవంత్‌రెడ్డి, కుసుమ కుమార్, బోసురాజు, అజహారుద్దీన్ హాజరయ్యారు.
పార్లమెంటు, అసెంబ్లీ, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, డీసీసీ అధ్యక్షులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. వార్డులు, కార్పొరేషన్లు, డివిజన్లవారీ అభ్యర్థులను సిద్ధంగా ఉంచాలని నాయకులు సమాలోచనలు జరిపారు. రిజర్వేషన్లు ఖరారయ్యేలోగా అభ్యర్థులను సిద్ధంగా ఉంచాలని నిర్ణయించారు.