ETV Bharat / state

గ్రేటర్​లో కాషాయం జెండా ఎగరడం ఖాయం: బండి సంజయ్​

author img

By

Published : Nov 24, 2020, 3:07 PM IST

గ్రేటర్​ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అందులో భాగంగా రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్​ హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో రోడ్​ షో నిర్వహించారు. గ్రేటర్​లో కాషాయం జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు.

bandi road show
గ్రేటర్​లో కాషాయం జెండా ఎగరడం ఖాయం: బండి సంజయ్​

గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్​ కుమార్​ హబ్సీగూడ, రామంతాపూర్​, ఉప్పల్​, చిలుకానగర్​లలో ఆ పార్టీ అభ్యుర్థుల గెలుపుకోసం రోడ్​షో నిర్వహించారు. రాష్ట్ర భాజపా ఉపాధ్యాక్షుడు ఎన్​వీఎస్​ఎస్​ ప్రభాకర్​తో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టాడు.

అభ్యర్థులు చందన, బండారు శ్రీవాణి, శైలజా, శిల్పారెడ్డిలను గెలిపించాలని సంజయ్‌ ఓట్లను అభ్యర్థించారు. గ్రేటర్‌లో కాషాయం జెండా ఎగరడం ఖాయమని అన్నారు. ఇచ్చిన హామీల్లో ఏ
ఒక్కటీ అమలు చేయకుండా మళ్లీ సాధ్యం కానీ హామీలను ఇచ్చి తెరాస ఓటర్లను మభ్యపెడుతుందని ఆరోపించారు. రోడ్‌షోకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.