ETV Bharat / state

కరోనా కేసుల పెరుగుదలకు సీఎం కేసీఆరే కారణం : భాజపా - పొంగులేటి సుధాకర్

కేంద్రంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర భాజపా నేతలు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఖరి వల్లే రాష్ట్రంలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయని అన్నారు.

'కమిషన్ల కోసమే మెగా కృష్ణారెడ్డితో ఫిక్సింగ్ టెండర్లు'

author img

By

Published : May 6, 2020, 10:58 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షలపై, కేంద్రంపై చేసిన అసత్య ప్రచారాలను భాజపా ఖండించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగటానికి సీఎం కేసీఆరే కారణమని భాజపా నేత, మాజీ ఎంపీ వివేక్ ఆరోపించారు. అసదుద్దీన్ ఒత్తిడితోనే మర్కజ్ వెళ్ళొచ్చిన వారికి కరోనా పరీక్షలు చేయట్లేదన్నారు. కరోనా నియంత్రణకు 7వేల కోట్ల రూపాయలను కేంద్రం తెలంగాణకు ఇచ్చిందని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం కమీషన్లు తినడం వల్లే తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందని ఎద్దేవా చేశారు. కమిషన్ల కోసమే మెగా కృష్ణారెడ్డితో ఫిక్సింగ్ టెండర్లు వేయించారన్నారు. ప్రతిపక్షాలపై తన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

కరీంనగర్ గడియారం వద్దకు...

చేతకాని నెపాన్ని కేంద్రంపై వేయటం సీఎం కేసీఆర్​కు అలవాటుగా మారిందని నేతలు చింతల రామచంద్రా రెడ్డి, పొంగులేటి సుధాకర్ మండిపడ్డారు. అన్ని రోజులు ఒకేలా ఉండవనే విషయాన్ని సీఎం కేసీఆర్ గ్రహించకపోవటం హాస్యాస్పదమన్నారు. అతి త్వరలోనే కేసీఆర్​కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలుపై చర్చకు సీఎం కేసీఆర్... కరీంనగర్ గడియారం వద్దకు రావాలని సవాల్ విసిరారు.

తప్పులు కప్పిపుచ్చుకోవడానికే...

రైతు బంధు, రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. కరోనాపై తానొక్కడే పోరాటం చేస్తున్నట్లు కేసీఆర్ బిల్డప్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా సైతం ఆశ్చర్యపోయే విధంగా ప్రధాని మోదీ కరోనా నియంత్రణకు చర్యలు తీసుకున్నారని వివరించారు. కేంద్రమే అన్ని రాష్ట్రాలకు పీపీఈ కిట్స్, మాస్కులు పంపిందని... తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ వైన్స్ షాపులు తెరిచారని పేర్కొన్నారు. ప్రభుత్వమే తెలంగాణలో ఎక్సైజ్​ను ప్రమోట్ చేస్తోందన్నారు. కోటి మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొంటామని చెప్పిన సీఎం కేసీఆర్ మాట తప్పారని ఎద్దేవా చేశారు.

ఇవీ చూడండి : సీఎంకు కృతజ్ఞతలు చెబుతూ మందుబాబు ఆనందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.