మీడియా, సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి ప్రకటన ఇవ్వకూడదని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ ఆర్సీ కుంతియా స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి ప్రకటన చేయొద్దని సూచిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు కుంతియా లేఖ రాశారు.
తెలంగాణ మీడియా, సామాజిక మాధ్యమాల్లో కొన్ని ప్రకటనలు చూశానని పేర్కొన్న కుంతియా... ఈ కారణాలతో పార్టీలో గందరగోళం నెలకొని... బలహీన పరుస్తుందని వెల్లడించారు. ఈ అంశంపై ఎవరైనా టీపీసీసీ, ఏఐసీసీకి తమ అభిప్రాయాలను లేఖ రూపంలో తెలియజేయవచ్చనని పేర్కొన్నారు.