కరోనా విస్తరణతో వెంటిలేటర్లకు పెరుగుతోన్న డిమాండ్‌ను తీర్చేందుకు... తక్కువ ఖర్చులోనే స్మార్ట్ వెంటిలేటర్ తయారీ ఆలోచనను పంచుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ ముందుకొచ్చింది. నగరానికి చెందిన స్మార్ట్ ధ్యానా అనే అంకురం త్రీడీ ప్రింటింగ్, గృహ సంబంధ ఉపకరణాలతో 5 వేల రూపాయలతోనే వెంటిలేటర్ తయారీ మోడల్‌ను రూపొందించింది. రాష్ట్రం, దేశం వెంటిలేటర్ డిమాండ్‌ను చవిచూస్తున్న ప్రస్తుత తరుణంలో.. తమ ఈ మోడల్ ఇందుకు పరిష్కారాన్ని చూపుతుందని అంకుర నిర్వాహకులు కేటీఆర్, నరేంద్రమోదీలకు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
ఇందుకు సంబంధించిన వెంటిలేటర్ పని విధానాన్ని వీడియో రూపంలో పంచుకున్నారు. ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్.. వెంటిలేటర్ నమూనా, డెమోతో తమను సంప్రదించాలని వారిని కోరారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ, టీహబ్, టీవర్క్స్, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్‌ను వీరితో సంప్రదింపులు జరపాలని సూచించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో 154కు చేరిన కరోనా కేసుల సంఖ్య