ETV Bharat / state

Star Light Strides 2022: ఉత్సాహంగా మహిళల నైట్ మారథాన్​ - హైదరాబాద్ నగరంలో స్టార్ లైట్ స్ట్రైడ్స్ 2022

Womens night Run: ప్రతి ఏటా ఎదో ఒక ప్రేరణతో మారథాన్లు నిర్వహించే హైదరాబాద్‌ రన్నర్స్ క్లబ్ ఇప్పుడు మరొక మారథాన్ నిర్వహించింది. స్టార్ లైట్ స్ట్రైడ్స్ 2022 పేరుతో మహిళల రక్షణ, సాధికారత థీమ్‌గా తీసుకుని ఆదివారం రాత్రి 7గంటలకు గచ్చిబౌలి స్టేడియం నుంచి మారథాన్‌ నిర్వహించింది.

womens night run
womens night run
author img

By

Published : Oct 31, 2022, 12:07 PM IST

Updated : Oct 31, 2022, 12:20 PM IST

మహిళల నైట్ మారథాన్​.. స్టార్ లైట్ స్ట్రైడ్స్ 2022

Womens night Run: మహిళా సాధికారత అనేది మహిళల స్వీయ-విలువ భావాన్ని, వారి సొంత ఎంపికలను నిర్ణయించే సామర్థ్యాన్ని వారి కోసం, ఇతరుల కోసం సామాజిక మార్పును ప్రభావితం చేసే హక్కును ప్రోత్సహించడం. అలాంటి మహిళా సాధికారత థీమ్​గా హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్ నిర్వహించిన మారథాన్ ఉత్సాహంగా సాగింది.

గచ్చిబౌలి స్టేడియం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు 5కే, 10కే రన్​ను నిర్వహించారు. ఈ మారథాన్​లో చిన్నారులు, పెద్దలు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళా సాధికారత వైపు పరుగులు తీస్తామంటూ తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దేశంలో మహిళలందరూ రాత్రిపూట స్వేచ్ఛగా, భయంలేకుండా బయట తిరిగే రోజులు రావాలని కోరుతూ.. మహిళా సాధికారతపై అవగాహన కల్పిస్తూ చేస్తున్న ఈ కార్యక్రమంలో తాము కూడా పాల్గొనటం ఎంతో ఆనందంగా ఉందని మహిళా రన్నర్స్ తెలిపారు.

మహిళా సాధికారత, హక్కులను ప్రోత్సహించడం అనేది ప్రస్తుతమున్న ప్రపంచ ఉద్యమాల్లో ప్రధానమైనదిగా మారింది. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ మహిళా సాధికారత దినోత్సవం వంటి రోజులు కూడా ఊపందుకుంటున్నాయి. ఈ మారథాన్ అందుకు ప్రతిబింబం వంటిదని నిర్వాహకులు తెలిపారు. గత మూడేళ్లుగా మహిళా హక్కులు, సాధికారత థీమ్​లతో మారథాన్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

గృహిణులు, ఉద్యోగస్తులు, అన్ని వర్గాల మహిళలు కలిసి హాజరైన ఈ కార్యక్రమంలో అందరూ ఆడి, పాడి సందడి చేశారు. ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఇంటా, బయట పని చేసే మహిళలకు శరీర వ్యాయామం ఎంతో అవసరమంటూ నినాదాలు చేశారు. తోటి మహిళలందరితో కలిసి రన్​ను విజయవంతంగా పూర్తి చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 31, 2022, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.