ఇవీ చదవండి:'మోదీ అంతరిక్షంలో ఉండడమే ఉత్తమం'
'అల్పాహారంలో బొద్దింక.. హోటల్ సీజ్' - TIFFIN
బిజీ ఏరియాలో హోటల్. రోజు వందల మంది వస్తుంటారు. హోటల్ చూడటానికే బాగుంటుంది. కానీ కిచెన్ మాత్రం అధ్వాన్నం. భరించలేని కంపు. ఓ వినియోగదారుడి ఫిర్యాదుతో తనిఖీ చేసిన గ్రేటర్ అధికారులు.. వెంటనే హోటల్ సీజ్ చేశారు.
'అల్పాహారంలో బొద్దింక.. హోటల్ సీజ్'
ఉదయం హైదరాబాద్ ఈసీఐఎల్ చౌరస్తాలోని శ్రీసాయిరత్న హోటల్ అల్పాహారం తినేందుకు వెళ్లారు కొంతమంది యువకులు. వేడివేడిగా తీసుకొచ్చిన అల్పాహారంలో బొద్దింక కనబడడంతో దాన్ని అలాగే పడేశారు. హోటల్ సిబ్బందిని పిలిచి ఏంటని ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాధానం రాలేదు. వెంటనే బాధితుడు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు శ్రీసాయిరత్న హోటల్‌కు చేరుకుని వంటగది, ఆహార పదార్థాలను పరిశీలించారు. కుళ్లిన ఆహార పదార్థాలు చూసి అవాక్కయ్యారు. సరైన నాణ్యత లేకపోవడం, అపరిశుభ్ర వాతావరణం చూసి వెంటనే హోటల్‌ను సీజ్ చేశారు.
ఇవీ చదవండి:'మోదీ అంతరిక్షంలో ఉండడమే ఉత్తమం'
Intro:Body:Conclusion: