హైదరాబాద్‌కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని శ్రీలిఖిత అన్నపూర్ణ... ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు సంపాదించింది. కేవలం 40 సెకన్లలో కళ్లకు గంతలు కట్టుకుని... చెస్ బోర్డు అరేంజ్‌మెంట్ పూర్తి చేసింది. హైదర్‌గూడలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ ఘనత సాధించింది.
శ్రీలిఖిత ప్రతిభకు మెచ్చిన ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు... ఆమెకు ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న శ్రీ లిఖిత... చెస్ టోర్నమెంట్లలో ఎన్నో పతకాలు సాధించింది. భవిష్యత్‌లో గ్రాండ్‌మాస్టర్‌గా నిలవాలనేదే తన లక్ష్యమని చెబుతోంది. కుమార్తె సాధించిన ఘనత పట్ల ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: నీటి కోసం 30 ఏళ్ల పాటు కాలువ తవ్విన భగీరథుడు