ETV Bharat / state

వరలక్ష్మీ వ్రతం వచ్చే... మహిళల కోరికలు తీర్చే

author img

By

Published : Aug 9, 2019, 5:19 AM IST

వరలక్ష్మీ వ్రతం వచ్చింది...  మహిళల కోరికలు  తీర్చింది... ప్రత్యేక అలంకరణలు పసిడి కొనుగోలులు పట్టువస్త్ర ధారణకు కేరాఫ్ అడ్రస్​గా అమ్మవారి పండుగ నిలిచింది. ఫ్యాషన్​ భామలను కూడా సంప్రదాయంతో కట్టిపడేసింది. తెలుగులోగిళ్లను నోములతో తట్టిలేపిన వరలక్ష్మీ వ్రతంపై ఈటీవి భారత్​ ప్రత్యేక కథనం.

వరలక్ష్మీ వ్రతం వచ్చే... మహిళల కోరికలు తీర్చే

శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం మహిళలకు ఎంతో ప్రత్యేకం. పూజలు, నోములతో తెలుగులోగిళ్లు కళకళలాడుతాయి. దేవాలయాల్లోని అమ్మవారికి అలంకరణలు, ప్రత్యేక పూజలు చేస్తారు. కొత్త వస్త్రాలతో మహిళలు, యువతులు సాక్షాత్తు లక్ష్మీదేవిని తలపిస్తారు.

రెండో శుక్రవారమే...

శ్రావణ మాసంలోని రెండవ శుక్రవారం వస్తుందంటే చాలు తెలంగాణ, ఆంధ్రా కొత్తదనం సంతరించుకుని అందంగా ముస్తాబవుతాయి. చిన్నపెద్ద... ప్రతీ ఒక్కరూ సంప్రదాయ వస్త్రాలను ధరిస్తారు. ప్రతీ ఇల్లు అలంకరణతో కళకళలాడుతుంది ఈరోజు. అంతేనా అమ్మవారి ప్రతిమతో నోములకు సిద్ధమవుతుంది.

ఆకర్షణగా అలంకరణలు

తెల్లవారింది మొదలు రకరకాల పూలతో అలంకరణలు, వంటకాలు, కొత్త వస్త్రాలు, పసిడి పూజలతో మహిళలు రోజంతా ఎంతో ఉత్సాహాన్ని కనపరుస్తారు. పేరంటానికి పిలవడం, వాయనాలు ఇవ్వటం వంటి కార్యక్రమాలు చేస్తారు. ఎవరి స్తోమతకు తగినట్లు వారు పండుగను జరుపుకుంటారు. తమకు, తమ కుటుంబానికి ఆయురారోగ్యాలు, ధనధాన్యాలు, సిరిసంపదలతో వర్ధిల్లజేయాలంటూ ప్రార్థిస్తారు. అప్పటివరకూ ఫ్యాషన్ అంటూ తిరిగే అమ్మాయిలు కూడా వరలక్ష్మీ వ్రతం రోజు సాంప్రదాయ పట్టు వస్త్రాలు ధరించి కుందనపు బొమ్మలను తలపించేలా తయారవుతారు.

ఇదీ చూడండి :చూస్తే రారమ్మనే పూలు... కొందామంటే ఆకాశాన ధరలు..

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.