హైదరాబాద్ పరిధి కంటైన్మెంట్ ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాపించకుండా అగ్నిమాపక శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో రసాయన ద్రావనం పిచికారీ చేపట్టారు. పోలీస్ చెక్ పోస్టులపైనా రసాయనం వెదజల్లుతున్నారు. బేగంపేట రసూల్‌పూరలోని కంటైన్మెంట్ ప్రాంతంతో పాటు గ్రీన్‌ల్యాండ్స్, ప్రకాష్‌నగర్, పోలీస్‌లైన్స్ ప్రాంతాల్లోని పోలీస్ చెక్‌పోస్టుల వద్ద రసాయన చల్లుతున్నారు.
చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది, రసాయనాలు పిచికారీ చేసే అగ్నిమాపక సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.