ETV Bharat / state

కాచిగూడలో ట్రాక్ మరమ్మతు పనులు వేగవంతం

హైదరాబాద్​ కాచిగూడ రైలు ప్రమాదం తర్వాత పునరుద్ధరణ పనులను రైల్వేశాఖ వేగవంతం చేసింది. ఇప్పటికే మొదటి, రెండో ట్రాక్​లపై పలు ట్రైన్లు నడుస్తున్నాయి. త్వరలోనే మూడో ట్రాక్​ పూర్తి చేసి... రైళ్లను నడుపుతామని స్పష్టం చేసింది.

కాచిగూడలో ట్రాక్ మరమ్మతు పనులు వేగవంతం
author img

By

Published : Nov 12, 2019, 4:37 PM IST

Updated : Nov 12, 2019, 7:13 PM IST

కాచిగూడలో ట్రాక్ మరమ్మతు పనులు వేగవంతం

కాచిగూడ రైలు ప్రమాదం తర్వాత రైల్వేస్టేషన్​లో పునరుద్ధరణ పనులను ఆ శాఖ యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. ఇంటర్​సిటీ ఎక్స్​ప్రెస్​, ఎంఎంటీఎస్​ రైళ్లు ఢీకొన్న తర్వాత పట్టాలపై ఉన్న క్లిప్పులు విరిగిపోయాయి. పట్టాలు మార్చే వద్ద సాంకేతికపరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రమాదం జరిగినప్పటి నుంచి పట్టాల మరమ్మతుతో పాటు విద్యుదీకరణ పనులు చేపట్టారు.

రేపు ఘటనపై విచారణ

ప్రాథమిక అంచనా ప్రకారం మానవ తప్పిదం వల్లే రైలు ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. రేపు రైల్వే శాఖ ఉన్నతస్థాయి కమిటీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టనుంది. ఘటనకు గల కారణాలు, సాంకేతిక అంశాలు, ప్రమాద సమయంలో డ్రైవర్​ వ్యవహార శైలి తదితర అంశాలపై విచారణ చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

మొదటి, రెండు ట్రాక్​లు పూర్తి

ఉదయం 11 గంటల నుంచి ఒకటో నంబర్​ ట్రాక్​ పూర్తిస్థాయిలో పనిచేసేలా చేశామన్నారు. ఈ ట్రాక్​పై ఇప్పటికే తిరుపతి నుంచి సికింద్రాబాద్​ వచ్చే సెవన్​ హిల్స్​ రైలు నడుస్తోంది. ఆ తర్వాత యశ్వంత్​పుర- కాచిగూడ ఎక్స్​ప్రెస్​ కూడా రెండో ట్రాక్​ నుంచి వెళ్లింది. ఇక మూడో ట్రాక్​లో మాత్రమే కొంత పనులు జరుగుతున్నాయి.

త్వరలోనే..

పనులు పూర్తైన ట్రాక్​లలో డీజిల్​ ఇంజిన్​ రైళ్లను నడుపుతున్నామని తెలిపారు. మిగిలిన పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. ఈ పనులు కూడా పూర్తైతే.. పాక్షికంగా రద్దయిన రైళ్లు, పూర్తిగా రద్దయిన రైళ్లు, దారి మళ్లించిన రైళ్లను తిరిగి పునరుద్ధరిస్తామని రైల్వేశాఖ పేర్కొంది. విద్యుదీకరణ పనులు పూర్తికాగానే ఎంఎంటీఎస్ రైళ్లను యథావిధిగా నడుపుతామన్నారు.

ఇవీ చూడండి: మోయతుమ్మెద వాగులో మునిగి ముగ్గురు మృతి

TG_HYD_31_12_RAILWAY_ACCIDENT_FOLLOW_UP_3182388_TS10121 reporter : sripathi.srinivas ( ) కాచిగూడ రైలు ప్రమాదం తర్వాత రైల్వే స్టేషన్ లో పునరుద్దరణ పనులను రైల్వే శాఖ యుద్ద ప్రాతిపదికన చేపట్టింది. ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్, ఎం.ఎం.టీ.ఎస్ రైళ్లు ఢీకొన్నతర్వాత పట్టాలపై ఉన్న క్లిప్పులు విరిగిపోయాయి. పట్టాలు మార్చే వద్ద సాంకేతికపరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రమాదం జరిగినప్పటి నుంచి పట్టాల మరమ్మత్తుతో పాటు విద్యుదీకరణ పనులు చేపట్టారు. ప్రాథమిక అంచనా ప్రకారం మానవ తప్పిదం వల్లే రైలు ప్రమాదం చోటు చేసుకుందని రైల్వే అధికారులు తెలిపారు. రేపు రైల్వే శాఖ ఉన్నతస్థాయి కమిటీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టనుంది. ఘటనకు గల కారణాలు, సాంకేతి అంశాలు, ప్రమాద సమయంలో డ్రైవర్ వ్యవహార శైలి తదితర అంశాలపై విచారణ చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి ఒకటో నంబర్ ట్రాక్ పూర్తిస్థాయిలో పనిచేసేలా చేశామన్నారు. ఈ ట్రాక్‌ పై ఇప్పటికే తిరుపతి నుంచి సికింద్రాబాద్ వచ్చే సెవన్ హిల్స్ రైలు వచ్చేసింది. ఆతర్వాత యశ్వంత్ పుర-కాచిగూడ ఎక్స్ ప్రెస్ కూడా రెండో ట్రాక్ నుంచి వెళ్లింది. ఇక..మూడో ట్రాక్ లో మాత్రమే కొంత పనులు జరుగుతున్నాయి. పనులు పూర్తయిన ట్రాక్ లలో డీజీల్ ఇంజన్ రైళ్లను నడుపుతున్నామన్నారు. మిగిలిన పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. ఈ పనులు కూడా పూర్తయితే..పాక్షికంగా రద్దయిన రైళ్లు, పూర్తిగా రద్దయిన రైళ్లు, దారి మళ్లించిన రైళ్లను తిరిగి పునరుద్దరిస్తామని రైల్వేశాఖ పేర్కొంది. విద్యుదీకరణ పనులు పూర్తికాగానే ఎం.ఎం.టీ.ఎస్ రైళ్లను యధావిధిగా నడుపుతామన్నారు. బైట్ : ఎం.వీ.ప్రసాద్, డీ.ఆర్.ఎం. (మొదటి బైట్). బైట్ : సాయి ప్రసాద్, ఏడీ.ఆర్.ఎం.(రెండవ బైట్).
Last Updated : Nov 12, 2019, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.