ETV Bharat / state

Vaccination​: గ్రేటర్​ పరిధిలో రెండోరోజు 22,399 మందికి వ్యాక్సిన్​

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం సాగుతోంది. జీహెచ్​ఎంసీ పరిధిలో నిన్న ప్రారంభం కాగా... రెండో రోజైన ఇవాళ 22,399 మందికి టీకా ఇచ్చారు.

special vaccination programme
గ్రేటర్​ పరిధిలో రెండోరోజు 22,399 మందికి వ్యాక్సిన్​
author img

By

Published : May 29, 2021, 10:23 PM IST

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంలో రెండోరోజు 22,399 మందికి టీకా ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో నిన్న ప్రారంభం కాగా.. మొదటి రోజు 21,666 మందికి వ్యాక్సినేషన్ అందించారు. ఇవాళ అంతకుమించి వ్యాక్సిన్ అందించారు. నిత్య సేవకులుగా గుర్తించిన వివిధ రంగాలకు చెందినవారికి పది రోజుల పాటు వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్​లోని ముప్పై సర్కిళ్లలో విస్తృత ఏర్పాట్లను చేపట్టింది.

ముందుగానే గుర్తించిన వారికి ప్రత్యేక టోకెన్లను అందచేసి వారికి ఇచ్చే వ్యాక్సినేషన్ సమయాన్ని కూడా ప్రత్యేకంగా పేర్కొనడంతో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సజావుగా సాగింది. కాగా నగరంలో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను పలువురు ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పలు కేంద్రాలను సందర్శించి పరిశీలించారు.

ఇదీ చదవండి: TS Lockdown: రేపు కేబినెట్​ భేటీ.. లాక్​డౌన్​పై కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.