వలస కూలీల తరలింపు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇంతకు ముందు రోజుకు రెండు నుంచి మూడు రైళ్లలో వలసకూలీలను శ్రామిక్ రైళ్లలో తరలించగా... శనివారం మాత్రం సుమారు 35కు పైగా రైళ్లలో వలస కూలీలను వారివారి స్వస్థలాలకు తరలించారు.
మొదట థర్మల్ స్క్రీనింగ్...
ఇప్పటి వరకు.. నగర శివారు రైల్వే స్టేషన్ల నుంచే శ్రామిక్ రైళ్లు బయల్దేరగా... శనివారం తొలిసారిగా ప్రధాన రైల్వే స్టేషన్లయిన సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ల వలస కార్మికులను తరలించారు. వలస కూలీలు ఉండే ప్రాంతాల నుంచి... బస్సులు, డీసీఎంవ్యాన్లలో అధికారులు రైల్వేస్టేషన్లకు తీసుకువచ్చారు. అనంతరం థర్మల్ స్క్రీనింగ్ చేసి స్టేషన్ లోపలికి పంపుతున్నారు.
సురక్షితంగా చేర్చుతాం...
శ్రామిక్ రైళ్ల ద్వారా... బిహార్, జార్ఖండ్, యూపీ, ఒడిశా, మణిపూర్, జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, బంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకు... వలసకూలీలను తరలించారు. సురక్షితంగా వారిని గమ్యస్థానాలకు చేర్చుతున్నామన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్... మొత్తం 128 రైళ్ల ద్వారా సుమారు లక్షా 70వేల మంది కూలీలను స్వస్థలాలకు పంపినట్లు తెలిపారు. వలస కూలీలకు... రైల్వేశాఖ అందిస్తున్న ఆహారానికి అదనంగా ఆహారం, నీళ్లు అందిస్తున్నట్లు వివరించారు.
ఇవీ చూడండి: 'చెస్ అంటే బోర్డ్‌పై కాదు.. ఆలోచనలపై గెలవాలి'