ETV Bharat / state

Stanplus Red Ambulance: కాల్‌ చేస్తే.. 8 నిమిషాల్లో రెడ్‌ అంబులెన్స్‌

Stanplus Red Ambulance: ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పడు సకాలంలో ఆస్పత్రికి తీసుకువెళ్లడం చాలా ముఖ్యం. అదే.. ఆలస్యమైతే కుటుంబానికి తీరని శోకం మిగులుతుంది. పంజాబ్‌కు చెందిన ఓ యువకుడికి తండ్రి అస్వస్థకు గురైనప్పుడు ఎదురైన సంఘటన.. మరెవరికీ రాకూడదనుకున్నాడు. అంబులెన్స్ వ్యవస్థ మెరుగుపరిచేందుకు ఫ్రాన్స్ వదిలి స్వదేశానికి చేరుకున్నాడు. ఎనిమిది నిమిషాల్లోనే రోగి చెంతకు అంబులెన్స్ చేరాలనే లక్ష్యాన్ని పెట్టుకుని 'స్టాన్ ప్లస్' స్టార్టప్ ప్రారంభించాడు. అనతి కాలంలోనే ఉత్తమ పారిశ్రామికవేత్తగా ఎదిగి స్ఫూర్తిగా నిలుస్తున్న ఆ యువకుడే.. ప్రబ్దీప్ సింగ్.

Stanplus Red Ambulance
Stanplus Red Ambulance
author img

By

Published : Mar 26, 2022, 4:58 PM IST

కాల్‌ చేస్తే.. 8 నిమిషాల్లో రెడ్‌ అంబులెన్స్‌

Stanplus Red Ambulance: అత్యవసరమైనప్పుడు సకాలంలో వచ్చే అంబులెన్స్ రోగి ప్రాణాలు నిలబెడుతుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే మన లాంటి దేశాల్లో.. వేగంగా అంబులెన్స్ రోగికి దగ్గరికి చేరుకోవటం సవాల్‌తో కూడుకున్న అంశం. దాన్ని సుసాధ్యం చేసేందుకు ప్రబ్దీప్ సింగ్ పాటు పడుతున్నాడు. 2016లో 15లక్షల పెట్టుబడితో హైదరాబాద్ కేంద్రంగా 'స్టాన్‌ప్లస్' స్టార్టప్ ప్రారంభించాడు. పంజాబ్ ఛండీగర్‌కు చెందిన ప్రబ్దీప్ సింగ్ ఎంబీఏ చేసి.. ఉన్నత చదువులు, ఉద్యోగం కోసం ఫ్రాన్స్‌కు వెళ్లాడు. ఫార్మా రంగంలో అక్కడే స్థిరపడ్డాడు. నాలుగేళ్ల క్రితం తన తండ్రి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఆయనను సకాలంలో ఆసుపత్రికి చేర్చేందుకు వారి కుటుంబ సభ్యులు పడిన కష్టం ప్రబ్దీప్‌ను తిరిగి స్వదేశం వచ్చేలా చేసింది.

''కేవలం 14-15శాతం భారతీయులు మాత్రమే అంబులెన్స్ సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. మిగిలిన వారు సొంత వాహనాలనే నమ్ముకుంటున్నారు. సొంత వాహనాలు అంత శ్రేయస్కరం కాదు. అందుకే అంబులెన్స్‌ ప్రాముఖ్యతపై మేము అవగాహన కల్పిస్తున్నాము. ప్రజలు సొంత వాహనాల కంటే అంబులెన్స్‌కు ఫోన్‌ చేసేలా చేయడమే మా ముందున్న అతిపెద్ద సవాల్‌. అందుకే చాలా అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నాము. సొంత వాహనాలు కన్నా 8నిమిషాల్లోనే ఆస్పత్రికి చేర్చే మా అంబులెన్స్‌లు ఉత్తమం.''

ప్రబ్దీప్ సింగ్, స్టాన్ ప్లస్ ఫౌండర్ &సీఈవో

StanPlus Ambulance Services: సాంకేతికత, విలువైన మానవవనరులను జోడించుకుంటూ అనతికాలంలోనే స్టాన్ ప్లస్‌ను పెట్టుబడులు ఆకర్షించే సంస్థగా మార్చాడు. ప్రబ్దీప్ సింగ్. ఇటీవల... 150 కోట్ల భారీ పెట్టుబడి సాధించి వార్తల్లో నిలిచారు. స్టాన్‌ప్లస్‌తో వెంచర్ కాపిటలిస్టులూ అనుసంధానమయ్యారు. ఇలా వరుస విజయాలతో దూసుకెళ్తున్న ప్రబ్దీప్.. ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలోనూ.. ఎంటర్‌ప్రెన్యూర్‌ ఇండియా 35 అండర్ 35 గా నిలిచాడు. '

స్టాన్‌ప్లస్‌లో పనిచేస్తున్న అందరికీ చాలా బాధ్యతలు ఉంటాయి. మా సంస్థ ధ్యేయం యూనికార్న్‌గా మారడం కాదు. 8నిమిషాల్లోనే రోగుల్ని ఆస్పత్రికి చేర్చి, ప్రాణాల్ని కాపాడటం. మా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. ఈ 8నిమిషాల అంబులెన్స్‌ వ్యవస్థకు ఒక ఇన్వస్టర్‌ తల్లి ధన్యవాదాలు తెలిపారు. వారి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈ సేవలు ఉపయోగ పడుతాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థ ఎంత అవసరమో ఆమె మాటలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మేం ఇక్కడ ప్రారంభించిన నాటి నుంచి మంత్రి కేటీఆర్‌ ఎంతో సహకారం సహకారం అందిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ స్టార్టప్ త్వరలోనే యూనికార్న్‌గా మారుతుందని నమ్ముతున్నాను.

స్టాన్‌ప్లస్ సేవలందించే వాహనాలకు "రెడ్ అంబులెన్స్" గా పేరు పెట్టారు. హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రులతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఈ స్టార్టప్‌ ప్రారంభించిన మొదట్లో కాల్ తీసుకున్న 45 నిమిషాల్లో రోగిని అంబులెన్స్ చేరుకుంటే.. ప్రస్తుతం 15 నిమిషాలకు తగ్గించ గలిగారు. 8నిమిషాల్లోనే చేరుకోవాలనేది స్టాన్‌ప్లస్ లక్ష్యం. ప్రాంతం, నగరంతో సంబంధం లేకుండా అందుబాటులో ఛార్జీలే వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరి వద్ద అన్ని అంబులెన్స్‌లకు పటిష్ట భద్రత ప్రమాణాలు ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. నిపుణులైన మానవ వనరులు, వైద్యసిబ్బంది సహకారంతో రోగిని క్షేమంగా ఆసుపత్రికి చేరుస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

మేము చాలా ఆస్పత్రులతో కలిసి పనిచేస్తున్నాము. 8నిమిషాల్లోనే అంబులెన్స్‌ ద్వారా చేరవేస్తున్నాము. మీకు అంబులెన్స్‌ వ్యవస్థ అవసరముంటే మమ్నల్ని సంప్రదించండి. మా సేవలు 24\7 అందుబాటులో ఉంటాయి. మాతో కలిసి పనిచేయడం వలన సకాలంలో రోగులకి వైద్యం అందించి వారి ప్రాణాల్ని కాపాడవచ్చు.

ప్రస్తుతం స్టాన్‌ప్లస్ ద్వారా హైదరాబాద్‌లో 200కు పైగా రెడ్ అంబులెన్స్‌లు ఉండగా.. దేశవ్యాప్తంగా 900 వరకు పనిచేస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు.. కోలకతా, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ వంటి మెట్రో నగారాల్లో స్టాన్‌ప్లస్ సేవలందిస్తోంది. రాబోయే ఆరునెలల్లో 15కు పైగా మెట్రోనగరాలకు రెడ్ అంబులెన్స్ సర్వీసులు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతున్న స్టాన్‌ప్లస్‌.. వేలకొద్ది రోగుల ప్రాణాలు కాపాడుతూనే యూనికార్న్ స్టార్టప్‌గా ఎదిగేందుకు పోటీపడుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 700 ఉద్యోగులు ఉండగా.. రాబోయే ఏడాదిలో దీన్ని రెట్టింపు చేస్తామని ప్రబ్దీప్ సింగ్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు.

ఇదీ చూడండి: కుంభస్థలం బద్దలుకొట్టిన 'ఆర్ఆర్ఆర్'.. తొలి రోజు కలెక్షన్లలో ఆల్ టైం రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.