ETV Bharat / state

నేటితో ముగియనున్న మారటోరియం.. కేంద్రం నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

author img

By

Published : Aug 31, 2020, 6:55 AM IST

బ్యాంకుల్లో వివిధ రకాల రుణాలు తీసుకుని కొవిడ్​ ప్రభావంతో ఆర్థికంగా చితికిపోయిన వారిని దృష్టిలో ఉంచుకుని రిజర్వ్‌ బ్యాంకు ప్రకటించిన మారటోరియం ఇవాళ్టితో ముగియనుంది. ఆర్బీఐ రెండు మార్లు మారిటోరియం ప్రకటించి... రుణాలపై ఆరు నెలలు వాయిదాలు చెల్లించాల్సిన అవసరం లేకుండా తాత్కాలిక ఉపశమనం ఇవ్వగలిగింది. ఆరు నెలలు గడిచినా... చాలా మంది ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఆర్థిక స్థితిగతులు చక్కబడక రుణాలపై ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు.

special story on Moratorium ending today
నేటితో ముగియనున్న మారటోరియం.. కేంద్రం నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

కొవిడ్‌ ప్రభావంతో దాదాపు యాభై రోజులపాటు దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార సంబంధ వస్తువులు, ఔషధాలు, కొవిడ్‌ సంబంధిత పరికరాలు మినహా మార్చి చివర వారం నుంచి ఏప్రిల్‌ నెల అంతా ఇతర కార్యకలాపాలు అన్నీ ఆగిపోయాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బ్యాంకుల నుంచి తీసుకున్న వివిధ రుణాలపై రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా మొదట మూడు నెలలపాటు మారటోరియం ప్రకటించింది.

మార్చి, ఏప్రిల్‌, మే మూడు నెలలు తరువాత మారిటోరియం ముగియాల్సి ఉండగా కొవిడ్‌ ప్రభావం కొనసాగుతుండడం వల్ల మరో మూడు నెలలు పొడిగించి ఆగస్టు చివర వరకు గడువు ఇచ్చింది. దీనితో రుణాలు తీసుకున్న వారందరికి తాత్కాలిక ఉపశమనం లభించింది. చేతిలో డబ్బు లేని వారికి ఈ మారటోరియం కొంత వెసులుబాటు అని చెప్పాలి. వాస్తవానికి మారటోరియం వల్ల... ఏలాంటి లబ్ధి లేకపోగా రుణాలు తీసుకున్న వారికి తీవ్ర నష్టం కలిగించేదిగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 30 లక్షలు గృహ రుణాలు తీసుకున్న వారు ఈ ఆరునెలలు మారటోరియం ఉపయోగించుకుని వాయిదాలు చెల్లించనట్లయితే... దీని ప్రభావంతో నిర్దేశిత వాయిదాల సంఖ్య కంటే మరో 18 వాయిదాలు అదనంగా కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అంటే ఆరునెలలు చెల్లించకపోవడం వల్ల... అదనంగా ఏడాదిన్నర వాయిదాలు చెల్లించాల్సి వస్తున్నందున... రుణాలు తీసుకుని డబ్బు ఉండి చెల్లించగలిగే వారికి ఇది ఏ మాత్రం ఉపయోగకరం కాదని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు.

కేంద్రం నిర్ణయంపై ఆసక్తి

బ్యాంకర్లు తెలిపిన వివరాల మేరకు గృహరుణాల్లో దాదాపు 90శాతం మారటోరియం తీసుకోలేదని, వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలు సంబంధించి కాస్త ఎక్కువ శాతం మారటోరియం తీసుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నాలుగైదు సంవత్సరాల్లో వాయిదాలు చెల్లింపులతో పూర్తయ్యే వారికి మారిటోరియం తీసుకున్నా.... దాని వల్ల పెద్దగా నష్టం ఉండదు. కానీ కొత్తగా రుణం తీసుకున్నవారు, దీర్ఘకాలం రుణ వాయిదాలు చెల్లించాల్సిన వారికి మాత్రం తీవ్ర నష్టమని బ్యాంకర్లు చెబుతున్నారు. కొవిడ్‌ ప్రభావం తగ్గకపోవడం వల్ల ఇంకా చాలా సంస్థలు తమ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో కొనసాగకపోగా వ్యాపారాలు కూడా ఆశించిన స్థాయిలో పుంజుకోలేదు. వివిధ రకాల రుణాలు తీసుకున్న వారిలో ఉద్యోగాలు పోగొట్టుకున్న వేలాది మంది ఉండడంతో... సెప్టెంబరు నెల నుంచి అయినా రుణ వాయిదాలు చెల్లిస్తారా అన్న అనుమానం బ్యాంకర్లల్లో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తదుపరి ఏలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

ఇదీ చూడండి : నేడు ఈసెట్ పరీక్ష... కరోనా కాలంలో తొలి పరీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.