ETV Bharat / state

గ్రేటర్​లో చెరువులు మాయం... వరదలకు ఆక్రమణలే కారణం! - బాలాపూర్​లోని గుర్రం చెరువు ఆక్రమణ

హైదరాబాద్ నగరంలోని చెరువులు కబ్జాలకు కేంద్రాలుగా మారాయి. జంట నగరాల్లోని నాటి పెద్ద చెరువులే నేడు కుంటలుగా... మరికొన్ని నామారూపాలు లేకుండా పోయాయి. కబ్జా చేసి చెరువుల్లోనే ఇళ్లు కట్టుకుంటున్నారు. చెరువులు రెండు మండలాల పరిధిలో ఉండడం వల్ల ఎవరికి ఫిర్యాదు చేసినా అధికారులు తమ పరిధి కాదని చేతులెత్తేయడంతో కబ్జా రాయుళ్లకు అవకాశంగా మారింది. ఈ కబ్జాల విషయంపై ఇక్కడే నాలుగు హత్యలు జరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాలాపూర్ లోని గుర్రం చెరువు కబ్జాలు... ప్రస్తుత పరిస్థితులపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

special story on  ponds canals occupied in greater hyderabad
గ్రేటర్​లో చెరువులు మాయం... వరదలకు ఆక్రమణలే కారణం!
author img

By

Published : Oct 24, 2020, 5:38 PM IST

Updated : Oct 28, 2020, 8:19 AM IST

గ్రేటర్​లో చెరువులు మాయం... వరదలకు ఆక్రమణలే కారణం!

హైదరాబాద్ జంట నగరాల్లోని చెరువులు ఒకప్పుడు గ్రేటర్​కు ముఖ్య నీటి వనరులు. కానీ నేడు నగరంలోని ఒక్క చెరువూ నాటిలా లేదు. చాలా ఏరియాల్లో స్థానికులే కబ్జాలకు పాల్పడ్డారు. ఎఫ్​టీఎల్, బఫర్ జోన్ దాటి చెరువుల్లోనే ఇళ్లు నిర్మించుకున్నారు. వీటిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడు లేరు. ఉన్నదానిలోనూ పూడికతీయక గుర్రపు డెక్కలు, పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. ఆక్రమణలకు గురికావడంతో తూములు మూసుకుపోయాయి. వాటి పరిధిలోని కాలువలూ నామారూపాలు లేకుండా పోయాయి. కొన్ని కాలువల్లో ఇళ్లు నిర్మించుకున్నారు.

చిన్నబోయింది ఇలా...

నగరంలోని బాలాపూర్ గుర్రం చెరువు మొత్తం 39 ఎకరాల 2 గుంటలు. కానీ నేడు 17 ఎకరాలు కబ్జాకు గురై కేవలం 22 ఎకరాల 2 గుంటలు మాత్రమే మిగిలి ఉంది. ఏళ్ల నుంచి చెరువుల్లోనే ఇళ్లు నిర్మించుకోవడం వల్ల తగ్గుతూ... కేవలం సగమే మిగిలి ఉంది. తొలుత చెరువుల బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టగా... నేడు చెరువుల మధ్యలోనే నిర్మిస్తున్నారు. గుర్రం చెరువు 60 శాతం బాలాపూర్ మండలం, 40 శాతం బండ్లగూడ మండలం రెవెన్యూ పరిధిలో ఉంది. రెండు మండలాల పరిధిలో మొత్తం 17 ఎకరాలు ఆక్రమణకు గురైంది. స్థానికులే కబ్జాలకు పాల్పడుతున్నారు. గుర్రం చెరువుకు సంబంధించిన ఆక్రమణలపై 4 హత్యలు జరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కబ్జా రాయుళ్లకు భయపడి ఇక్కడికి రావాలంటే అధికారులు జంకుతున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా.... చెరువుల్లో ఇళ్లు నిర్మించుకున్నా... రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటి వరకు ఒక్కరికీ నోటిసులు ఇవ్వకపోవడం గమనార్హం.

వాన కురిస్తే అవస్థలే...

ఇటీవల వర్షం పడిన సమయంలో అర్ధరాత్రి గుర్రం చెరువు తెగి కల్లోలం సృష్టించింది. ఒక్కసారిగా ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉరుకులు పరుగులు తీశారు. కొందరు ఇంటి పైకెక్కి ప్రాణాలను కాపాడుకుంటే.. మరికొందరు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. నీటి ఉద్ధృతికి రోడ్డుపై ఉన్న విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌లు నేలమట్టమయ్యాయి. ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. వరద ధాటికి దిగువ బస్తీల్లో ఇళ్లు, ప్రహరీలు కూలాయి. 13 తేదీన కురిసిన భారీ వర్షంతో గుర్రం చెరువు పూర్తిగా నిండి ఎఫ్‌టీఎల్‌లో ఉన్న నబీల్‌ కాలనీ, సయీద్‌ కాలనీ, రాయల్‌ కాలనీ, మెట్రో సిటీ, వీఐపీ కాలనీ, అలీ గుల్షన్, మజీద్‌ కాలనీ, బార్కాస్‌ బస్తీలు నీట మునిగాయి. మళ్లీ 17 న వాన కురవడం వల్ల చెరువు తెగి దిగువన ఉన్న హఫీజ్‌బాబానగర్‌ ఎ, బి, సి బ్లాక్‌లతో పాటు నసీబ్‌నగర్, నర్కీపూల్‌ బాగ్, సాయిబాబానగర్, శివాజీనగర్, అరుంధతి కాలనీ, లలితాబాగ్‌లు జలమయమయ్యాయి.

జలమయం

గుర్రం చెరువుకు గండి పడడంతో పలు కాలనీలు మొత్తం నీటమునిగాయి. 14 తేదీ ఉదయం నుంచే ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు రంగంలోకి దిగి వరదనీటికి ఇళ్లల్లో చిక్కుకున్న వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ చెరువు నీటితో మొత్తం 3 లక్షల జనాభా వరకు ఇబ్బందులు పడ్డారు. చెరువు కిందివైపు ఉన్న పూల్బాక్ కాలువ నుంచి నీరు మూసిలోకి కలుస్తుంది. కాలువలో మొత్తం ఇళ్లు నిర్మించడంతో ఇళ్లలోకి నీరు చేరింది. మరోవైపు గుర్రం చెరువు తెగి వరద ఉద్ధృతికి వాహనాలు కొట్టుకొని పోగా.... కింది వైపునకు ఉన్న పంట పొలాల్లోకి నీరు చేరి తీరని నష్టాన్ని మిగిల్చింది.

చర్యలు అవసరం

చెరువుల ఆక్రమించుకోవడం వల్ల వరద నీరు కిందికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. చెరువులు.. కాలువలు ఆక్రమణకు గురైన చోట వాననీరు ఇళ్లల్లోకి, రహదారులపైకి వస్తోంది. పాతబస్తీలోని ప్రజాప్రతినిధుల బెదిరింపులతో అధికారులు అటువైపు చూడటానికే భయపడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కబ్జాలను అరికట్టి తమ ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: ఫాక్స్​సాగర్​ ఉగ్రరూపం... రోడ్డునపడ్డ 3వేల మంది

Last Updated : Oct 28, 2020, 8:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.