ETV Bharat / state

ప్రాణాలకు తెగిస్తూ.. పునర్జన్మ అందిస్తూ... - అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 2021

కళ్ల ముందే ఎంతో మంది శ్వాస ఆడక ఇబ్బంది పడుతున్న వారు కొందరు.. అయినవారిని చివరిచూపు సైతం నోచుకోకుండా కడదేరిపోతున్న మరికొందరు.. గుండె బరువెక్కిన ఇలాంటి ఎన్నో సంఘటనలకు ప్రత్యక్షసాక్షులైనా నర్సుల ఉక్కు సంకల్పం మాత్రం చెదరట్లేదు. మహమ్మారి పోరులో ఏడాదిగా ఇంటికి, కుటుంబాలకు దూరంగా ఉంటూ వారు అందిస్తున్న సేవలు నిరుపమానం. ఓ పక్క కలవరపెడుతున్న మరణాలు.. బాధితులతో కిక్కిరిసిన ప్రాంగణాలు.. అంతటి భీతావాహ వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి ఎంతోమందికి పునర్జన్మనిచ్చే క్రతువులో పాలుపంచుకుంటున్నారు. పరిస్థితి విషమించి ఆసుపత్రిలో చేరినవారు కోలుకుని వెళ్లేప్పుడు చిరునవ్వుతో చూసే ఆ చూపులే మాకు ఆశీర్వచనాలు అంటున్నారు పలువురు వైద్య సిబ్బంది. నేడు ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా కొవిడ్‌ వార్డుల్లో సేవలందిస్తున్న కొందరి అభిప్రాయాలు మీకోసం..

international nurses day
international nurses day
author img

By

Published : May 12, 2021, 7:41 AM IST

కుటుంబానికి దూరంగా ఉంటూ...

రేణుక, స్టాఫ్‌ నర్సు, గాంధీ ఆసుపత్రి

కరోనా కారణంగా ఏడాదిగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాను. చిన్న పిల్లలు ఉన్నందున ఆసుపత్రిలో విధులు నిర్వహించి కరోనాను ఇంటికి మోసుకు పోతున్నానేమో అనే భయంతోనే దూరంగా ఉండాల్సి వస్తోంది. ఆసుపత్రికి వచ్చే రోగుల్లో ఒక్కొక్కరిది ఒక్కో పరిస్థితి. అందరినీ అర్థం చేసుకుని సేవలు అందించడం సవాలుతో కూడుకున్న పనే. మా సేవలు అందుకుంటున్న రోగులందరూ కోలుకుని ఇంటికి పోవాలని దేవున్ని కోరుకుంటున్నా.

యువకుడి మరణం కన్నీరు పెట్టించింది.

మేఘమాల హెడ్‌ నర్సు, గాంధీ ఆసుపత్రి

రోజు మాదిరిగానే ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నాను. ఓ రోజు ఓ యువకుడితో మాట్లాడి ఇంటికి వెళ్లాను. తిరిగి మరుసటి రోజు వచ్చేసరికి ఆ బెడ్‌ మీద అతను లేడు. మరో వార్డుకు మార్చారని అనుకున్నా.. మృతి చెందారని తెలిసి తట్టుకోలేక పోయాను. ఇలా కొంత మందికి జరిగిన ఘటనలు కన్నీళ్లు పెట్టించాయి. కొంత మంది వృద్ధులు జీవితంపై ఆశలు వదిలేసుకున్నారు. వారిలో భయం పోగొట్టి ఆ మనోవేదన నుంచి బయటకు తీసుకొచ్చాం. అలా కొంత మంది సాధారణ స్థితికి వచ్ఛి. ఇళ్లకు వెళ్లారు. అలాంటప్పుడు ఏదో సాధించిన అనుభూతి కలుగుతుంది. సహాయకులు లేని వారికి జ్యూస్‌లు తాగించడం, భోజనం తినిపించడం, ఆసుపత్రి సిబ్బంది సాయంతో డైపర్లు కూడా మార్చడం వంటివి చేస్తున్నాం.

నర్సులదే కీలక పాత్ర

విజయకుమారీ, స్టాఫ్‌ నర్సు, నిమ్స్‌

కొవిడ్‌ మొదటి దశ నుంచి రెండో దశ వరకు ప్రతి ఒక్కరూ సెలవులు లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. కొవిడ్‌ వార్డుల్లోకి అయినవారే వెళ్లేందుకు సుముఖత చూపించడం లేదు. మేము ఆత్మస్థైరంతో సేవలందిస్తున్నాం. మందులు, ఇంజక్షన్‌ల ప్రభావం ఎంత ఉంటుందో.. వారిలో ధైర్యం నింపితే అంతకంటే రెట్టింపు శక్తి వస్తుంది. వారి రోగాన్ని గుర్తు చేయకుండా కోలుకునేలా అవగాహన కల్పిస్తాం. ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉంటూ వారి కదలికలను పరిశీలిస్తాము. ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే స్పందిస్తాం.

మమ్మల్ని మేము మరిచిపోతున్నాం

చంద్రకళ, గాంధీ ఆసుపత్రి హెడ్‌ నర్సు

బయట ఎన్ని సమస్యలున్నా ఆసుపత్రికి వెళ్తే మమ్మల్ని మేము మరిచిపోయి సేవలందిస్తాం. కొంత మంది దగ్గర ఫోన్‌లు కూడా అందుబాటులో ఉండవు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తాం. అప్పుడు వారిలో తెలియని సంతోషం కనిపిస్తుంది. ఆందోళన చెందకుండా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్తారని ధైర్యం నింపుతాం. పరిస్థితి విషమించి ఎవరైనా మృతి చెందితే ఆ ఆరోజు గడవడం కష్టంగా ఉంటుంది. కొవిడ్‌ వార్డులో పనిచేస్తున్నా ఇప్పటివరకు మహమ్మారి నుంచి నన్ను నేను కాపాడుకుంటున్నా.

సంతోషంగా ఇళ్లకు పంపిస్తున్నాం

ఫాతిమా, హెడ్‌ నర్సు, నిమ్స్‌

ఆసుపత్రికి వచ్చిన ప్రతి కొవిడ్‌ బాధితుడు కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్లాలని కోరుకుంటాం. ఇక్కడికి వచ్చిన వారిని చూస్తే.. ఎంతో బాధనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఆరోగ్యంగా వెళ్తే.. ఆరోజు ఎంతో సంతోషంగా ఉంటుంది. అప్పటి వరకు పడ్డ కష్టాన్ని ఒక్కసారిగా మరిచిపోతాం. ఒక్కసారి వార్డులోకి వస్తే అన్నీ మేమే చూసుకుంటాం. ఇటీవల మా అబ్బాయికి కొవిడ్‌ వచ్చింది. ఎలాంటి ఆందోళన లేకుండా ధైర్యం చెప్పాను. పది రోజుల్లోనే కోలుకున్నాడు. ధైర్యంగా ఉంటే వైరస్‌ను జయించొచ్చు.

ఇదీ చదవండి: సరిహద్దుల్లో అంబులెన్స్​లను అడ్డుకోవద్దు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.