ETV Bharat / state

వేగం పుంజుకుంటున్న జనజీవనం.. మెరుగవుతున్న రవాణా

వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌ వంటి నగరాల్లో క్రయ, విక్రయాలు వృద్ధి చెందుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. పూర్వం లాగే దుకాణాలను రాత్రి వరకు తెరిచి ఉంచుతున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో టిఫిన్‌ బండ్లు, ఐస్‌క్రీంల విక్రయ శాలల వద్ద జనం రద్దీ పుంజుకుంటోంది.

Improving public transport in cities
వేగం పుంజుకుంటున్న జనజీవనం.. మెరుగవుతున్న రవాణా
author img

By

Published : Oct 9, 2020, 6:50 AM IST

కరోనా నుంచి కోలుకునేవారు పెరుగుతున్న క్రమంలో జనం ధైర్యాన్ని కూడగట్టుకుని యథావిధిగా బయటకు వస్తున్నారు. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం.. ఏ అవసరం ఉంటే దానికి.. ఎక్కడికి వెళ్లాల్సి ఉంటే అక్కడికి వెళ్తున్నారు. జనజీవనం సాధారణ పరిస్థితులకు దగ్గరగా చేరుకుంటోంది. ప్రజారవాణా, వ్యాపార, వాణిజ్యాలు గాడిన పడుతున్నాయి. లాక్‌డౌన్‌లో పూర్తిగా స్తంభించిపోయిన రంగాల్లో కొన్ని అన్‌లాక్‌ వెసులుబాటుతో దాదాపుగా పూర్వస్థితికి చేరుకున్నాయి. ఇంకొన్ని పుంజుకుంటున్నాయి. వస్త్రవ్యాపారం, బంగారు దుకాణాల వంటివి దసరా, దీపావళి పండగలపై ఆశలు పెట్టుకున్నాయి.

కుటుంబం గడవాలంటే.. బయటకు వెళ్లక తప్పదన్న భావన పెరగడం మంచిదే అయినా.. అజాగ్రత్త తగదని, కొవిడ్‌ సోకకుండా స్వీయ రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్‌తో తీవ్రంగా ప్రభావితమైన వాటిలో నిర్మాణ రంగం ఒకటి. వలస కార్మికులు భారీ సంఖ్యలో సొంతూళ్లకు వెళ్లారు. దీంతో అపార్టుమెంట్లు, ఇళ్ల నిర్మాణ పనులపై నాలుగైదు నెలలపాటు ప్రభావం పడింది. ఇప్పుడు బిల్డర్లు.. ఆఫీసులో పనిచేసే ఉద్యోగులకు కరోనా బీమా పాలసీలు చేయిస్తూ, ఆక్సిజన్‌ పరికరాల్ని ఏర్పాటుచేస్తూ వారిలో ధైర్యం కల్పిస్తున్నారు. సొంత రాష్ట్రాలకు వెళ్లిన కార్మికుల్ని తిరిగి రప్పిస్తున్నారు. బిహార్‌లోని దర్భంగ నుంచి సికింద్రాబాద్‌కు రోజూ ఒకే రైలు ఉండేది. వలస కార్మికుల రద్దీ పెరగడంతో సెప్టెంబరు 21వ తేదీ నుంచి రెండో రైలునూ పట్టాలెక్కించారు. ఉత్తర్‌ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా నుంచీ కార్మికులు తిరిగి వస్తున్నారు.

భయం వీడి.. బతుకుబాటలో..

పండగలపైనే వస్త్రవ్యాపారుల ఆశలు

కొవిడ్‌తోపాటు అధిక మాసం రావడం, పెళ్లిళ్ల సీజన్‌ లేకపోవడంతో ఆ ప్రభావం వస్త్రాల అమ్మకాలపై పడింది. దుకాణాల్లో ఉద్యోగులను రోజు విడిచి రోజు రమ్మంటున్నారు. కరోనాకు ముందుతో పోలిస్తే అమ్మకాలు 30 శాతంలోపే ఉన్నాయని.. దసరా, దీపావళి పండగలపైనే ఆశలు పెట్టుకున్నట్టు క్లాత్‌, రెడీమేడ్‌ అసోసియేషన్‌ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కమర్తపు రవీందర్‌ చెప్పారు.

భయం వీడి.. బతుకుబాటలో..

అంతటా సందడి..

విమాన ప్రయాణాలు పెరుగుతున్నాయి. కొవిడ్‌కు ముందు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి సగటున రోజూ 55 వేల మంది దేశీయ, 6 వేల మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించేవారు. రోజుకు 550 విమానాలు వచ్చివెళ్లేవి. లాక్‌డౌన్‌తో ఆగిపోయిన విమానాలు మే 25 నుంచి మళ్లీ ప్రారంభం కాగా, తొలి రోజు 3 వేల మంది కోసం 38 సర్వీసులు నడిచాయి. జూన్‌లో 7 వేలకు, సెప్టెంబరులో 16 వేలకు, తాజాగా రోజుకు 20 వేలకు ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌కు కొద్దిరోజుల క్రితం కొత్త సర్వీసు ప్రారంభమైంది. లాక్‌డౌన్‌కు ముందు దేశంలో 55 ప్రాంతాలకు విమానసర్వీసులు ఉండగా.. ఇప్పుడు 51 ప్రాంతాలకు నడుస్తున్నాయి.

అన్నీ తిరుగుతున్నాయ్‌

ఇంధనం ఖర్చు కూడా రాక ఆటోల్ని పక్కనపెట్టిన డ్రైవర్లు.. ప్రయాణికులు పెరగడంతో వాటిని తిప్పుతున్నారు. రాజధానిలో ఆటోలు, క్యాబ్‌ల సంఖ్య క్రమంగా పెరిగింది. వీటికి తోడు సిటీబస్సులు కూడా తిరుగుతుండడంతో రోడ్లపై రద్దీ పెరిగింది. పలు రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నీ పనిచేస్తున్నాయి.
పంతంగి టోల్‌ప్లాజా నుంచి నిత్యం 25 వేల వాహనాలు రాకపోకలు సాగించేవి. కానీ, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ 20న ప్రయాణించిన వాహనాలు 6 వేలే. సగటున మేలో 15 వేలు, జూన్‌లో 20 వేలకు పెరిగాయి. సెప్టెంబరు తొలివారంలో ఈ సంఖ్య 25,600 ఉండగా.. 20వ తేదీన అత్యధికంగా 30,200 వాహనాలు వెళ్లాయి. ఇప్పుడు కూడా ఇంచుమించు ఇదే స్థాయిలో తిరుగుతున్నాయి. హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో లాక్‌డౌన్‌కు ముందు కంటే ఇప్పుడే ఎక్కువ వాహనాలు తిరుగుతున్నాయి. గతంలో బస్సులు, ఇతర రవాణా మార్గాల్లో వెళ్లినవాళ్లు ఇప్పుడు కార్లను వినియోగిస్తున్నారు.

ఆర్టీసీ, రైలు, విమాన సేవలు కూడా లాక్‌డౌన్‌తో పోల్చితే గణనీయంగా పెరిగాయి.

భయం వీడి.. బతుకుబాటలో..
  • దేశవ్యాప్తంగా మేలో రైళ్లు 30 సర్వీసులతో ప్రారంభమై ఇప్పుడు 350కి పెరిగాయి.
  • జూన్‌లో 3,200 బస్సులు నడిపించిన టీఎస్‌ఆర్టీసీ సెప్టెంబరు తొలివారంలో ఆ సంఖ్య 3,900కి పెంచింది. ప్రయాణికులు పెరుగుతుండటంతో ఇటీవల బస్సుల సంఖ్య 4,200కు పెరిగింది. 700 సిటీ సర్వీసులు రోడ్డెక్కడంతో మొత్తం బస్సుల సంఖ్య 4,900కి చేరింది. కర్ణాటక, మహారాష్ట్ట్రలకు 190 వరకు బస్సుల రాకపోకలు మొదలయ్యాయి.
    కొంతకాలం క్రితం వరకు వెలవెలబోయిన హోటళ్లలో రూమ్‌ల బుకింగ్‌ పెరుగుతోంది. వరంగల్‌ హరిత హోటల్‌లో సెప్టెంబరు తొలివారం రోజుకు 2
  • 3 గదులు బుక్‌ అయితే.. ఇప్పుడు కనీసం 10 అవుతున్నాయి.
  • ఆలయాలకు కొన్ని రోజులుగా భక్తుల సంఖ్య పెరుగుతోంది. యదాద్రికి జులై, ఆగస్టులలో సాధారణ రోజుల్లో నిత్యం 2-3 వేల మంది.. శని, ఆదివారాల్లో 5-6 వేల మంది భక్తులు వచ్చారు. సెప్టెంబరు 2వ వారం నుంచి సాధారణ రోజుల్లో 4 వేలు.. శని, ఆదివారాల్లో 6-7 వేల మంది వస్తున్నారు.
  • వ్యాపారాలు, పుంజుకోవడంతో అమ్మకాలతో వాటిపై పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరుగుతోంది.
భయం వీడి.. బతుకుబాటలో..

కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయ్‌

జూన్‌ నుంచి వాహన విక్రయాలు గాడిన పడ్డాయి. ముఖ్యంగా 5-8 లక్షల రూపాయల తక్కువ బడ్జెట్‌లో దొరికే చిన్న కార్ల అమ్మకాలు గతంలో కంటే పెరిగాయి. మధ్యతరగతి వర్గీయులు కరోనా భయంతో సొంతవాహనంలో వెళ్లడం మంచిదని భావిస్తూ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో అన్ని రకాలవి కలిపి నెలకు దాదాపు 10 వేల కార్ల విక్రయాలు జరుగుతాయి. ఇందులో 50 శాతం ఓ ప్రధాన కంపెనీవే. ఆ కంపెనీ కార్లు ఏప్రిల్‌-ఆగస్టు వరకు గతేడాది 28,694 విక్రయం జరిగితే.. ఈ సంవత్సరం 38 శాతం తగ్గి 17,728కి పరిమితమయ్యాయి. అయితే జులై నుంచి అమ్మకాలు పెరిగాయి. గత ఏడాది జులైలో 5,606 కాగా ఈసారి 6,156 కార్లు.. గత ఆగస్టులో 5,723 కాగా ఈ ఏడాది 6,612 కార్ల అమ్మకాలు జరిగాయి.- వినయ్‌ సాబు, సాబూ ఆర్‌కేఎస్‌ మోటార్స్‌ సీఎండీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.