ETV Bharat / state

'మహిళలకు భరోసానిస్తూ.. వేల జీవితాల్లో వెలుగులు నింపుతూ..'

author img

By

Published : Jun 18, 2021, 8:57 AM IST

తన చదువుతో మంచి ఉద్యోగం చేసుకుంటూ హాయిగా గడపొచ్చు.. కానీ కాంటేకర్‌ మంజుల అలా అనుకోలేదు. ఒంటరి, అభాగ్య మహిళలకు ఆర్థిక భరోసా ఇవ్వాలనుకుంది.. ఆ దిశగా తన కృషి వేల జీవితాల్లో వెలుగులు నింపుతోంది...

special story on Contekar‌ Manjula
'మహిళలకు భరోసానిస్తూ.. వేల జీవితాల్లో వెలుగులు నింపుతూ..'

‘ఆకలితో ఉన్నవాడికి ఓ పూట చేపల కూరతో మంచి భోజనం పెట్టొచ్చు. కానీ రోజూ పెట్టలేం కదా! అందుకుని అతనికి చేపలు పట్టడం నేర్పిస్తే సరి’... పెళ్లైన కొత్తలో భర్త శ్రీనివాస్‌ అన్న మాటలు మంజులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అవసరంలో ఉన్నవారికి సాయంతో పాటు నైపుణ్యాలని కూడా అందిస్తే అదే వాళ్ల జీవితాల్లో వెలుగు నింపుతుందని నమ్మింది. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన మంజుల... తోటివారికి సాయం చేయాలన్న తపనతో మాస్టర్స్‌ ఇన్‌ సోషల్‌ వర్క్‌ (ఎంఎస్‌డబ్ల్యూ) చదివింది. 1999లో పది మందితో శ్రీసాయి ఎడ్యుకేషనల్‌ సొసైటీని ప్రారంభించి.. మహిళలకు కుట్టు, ఎంబ్రాయిడరీ వంటి వాటిలో శిక్షణా కార్యక్రమాలను మొదలుపెట్టింది.

భర్త మద్దతు కూడా తోడవ్వడంతో ఆ కార్యక్రమాలను క్రమంగా విస్తృతం చేసింది. మొదట్లో సొసైటీ నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయలేదు. కాలక్రమంలో ఘట్‌కేసర్‌ మండలంతోపాటు నల్గొండ, మహబూబ్‌నగర్‌, ప్రకాశం జిల్లాల్లో సొసైటీ కార్యక్రమాలు విస్తరించాయి. ఇక్కడ శిక్షణ పొందిన మహిళలు బ్యాంకుల నుంచి రుణాలు అందుకుని స్వయం ఉపాధి పొందుతూ నెలకు రూ.12నుంచి రూ.18వేల వరకు సంపాదిస్తున్నారు. దాంతో సొసైటీని నాబార్డు గుర్తించి ఆర్థిక సాయం అందించింది. అప్పటి నుంచి మంజుల వెనుదిరిగి చూడలేదు. టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ, జర్దోసి, బంజారవర్క్‌, బ్లాక్‌ ప్రింటింగ్‌లతో పాటు బ్యాగులు, గృహాలంకరణ వస్తువుల తయారీని నేర్పించే వారు.

ఇప్పటి వరకు ఈ సంస్థలో సుమారుగా 8 వేల మంది శిక్షణ పొందారు. ఇక్కడి మహిళలు రూపొందించిన ఉత్పత్తులకు.. దిల్లీ, ఆగ్రా, అలహాబాద్‌, గాంధీనగర్‌లలో మంచి గిరాకీ ఉంది. భర్త శ్రీనివాస్‌ మరణించడంతో ఆయన సోదరులు సేవా కార్యక్రమాలకు అండగా నిలుస్తున్నారు. శిక్షణ మాత్రమే కాకుండా ఆపదలో ఉన్నవారికి మేమున్నామంటూ అండగా ఉంటోంది మంజుల. ఈ సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసా పత్రంతో గౌరవించింది.

.

‘మధ్యతరగతి, పేద మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయించాలన్నదే నా ప్రయత్నం. అందుకే సొసైటీ ఆధ్వర్యంలో మూడు నెలలకోసారి గ్రామీణ ప్రాంతాలకు వెళ్తా. అక్కడే శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి ఆసక్తి ఉన్నవారికి కుట్టు, ఎంబ్రాయిడరీ, జర్దోసి, బ్యాగుల తయారీలో శిక్షణనిస్తాం. వారి ఉత్పత్తులు అమ్ముకోవడానికి కావాల్సిన భరోసా ఇస్తాం. గతేడాది నుంచి ఇప్పటి వరకు సొసైటీ ద్వారా సుమారు 3 లక్షల వరకు మాస్కులు తయారు చేసి ఉచితంగా పంపిణీ చేశాం. పేదలకు ఉచితంగా భోజనం, నిత్యావసర సరకులు పంపిణీ చేశాం. శిక్షణకు వచ్చే మహిళలు చాలా మంది నిరక్షరాస్యులు. అందువల్ల వారికి ఇక్కడ చదువుతో పాటు స్పోకెన్‌ ఇంగ్లిషు కూడా నేర్పిస్తున్నాం. బ్యాంకులో అకౌంట్‌లు తెరవడం, పొదుపు చేయడం, విత్‌డ్రా వంటి వ్యవహారాలను స్వయంగా చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. దీని వల్ల వారు ఇతరుల మీద ఆధారపడాల్సిన అగత్యం తప్పుతుంది’ అంటున్నారు మంజుల.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.