ETV Bharat / state

సాధనలోనూ.. సహాయం చేయడంలోనూ.. ఆమెకు ఆమె సాటి! - Namratha news

సాధించాలన్న తపన.. పట్టుదల.. ఆసక్తి... ఉంటే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయొచ్చని నిరూపిస్తోంది ఓ యువతి. విద్యా, ఉద్యోగం.. పర్వతాలన్ని అధిరోహించడం ఇలా పలు రంగాల్లో తన ప్రతిభ చూపిస్తోంది. వీటితో పాటు సామాజిక సేవలోనూ తన మంచి మనసు చాటుకుంటోంది. 17 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకుని చదివిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఆ యువతి.. నమ్రత గురించి తెసుకుందాం.

Namratha
Namratha
author img

By

Published : Mar 30, 2022, 6:43 PM IST

సాధనలోనూ.. సహాయం చేయడంలోనూ.. ఆమెకు ఆమె సాటి

ఉన్నత విద్య.. మంచి ఉద్యోగం.. జీవితంలో స్థిరపడితే చాలు అనుకునే వారు ఎక్కువగా ఉండే ఈ రోజుల్లో.. హైదరాబాద్‌ అమీర్‌పేట్‌కు చెందిన నమ్రత మాత్రం భిన్నంగా ఆలోచించింది. ఇంజినీరింగ్‌, ఎంబీఏ పూర్తి చేసి అమెరికాలో ఉద్యోగం చేస్తూనే.. 17 మంది విద్యార్థులను దత్తత తీసుకుని వారికి చదువు చెప్పిస్తోంది. పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్న ఈ యువతి కిలిమంజారో అధిరోహించింది.

చిన్నప్పటి నుంచే ప్రతిభాశాలి: చిన్నప్పటి నుంచే నమ్రత చదువులో మేటి కావడంతో తల్లిదండ్రులకు పెద్దగా ఖర్చుపెట్టే అవకాశం రాలేదు. ఎంట్రన్స్‌లోనే మంచి ర్యాంకు సంపాధించింది. వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో... బీటెక్‌ పూర్తి చేరింది. చదువేటప్పుడు ఇంట్లో వాళ్లను ఫీజు అడిగింది లేదు. అడపదడపా తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్‌మనీ పొదుపు చేసి ఫీజు కట్టుకునేది. అమెరికా సౌత్‌ కరోలినా రాష్ట్రంలోని క్లెమ్సన్‌ విశ్వవిద్యాలయంలో కంపూటర్స్‌లో ఎమ్మెస్‌ చేసింది. దిగ్గజ ఐటీ సంస్థలు హెచ్‌పీ, ఇంటెల్‌లో ఉద్యోగం సంపాదించింది. అంతటితో ఆమె చదువు ఆపేయకుండా... లండన్‌ బిజినెస్‌ స్కూల్‌లో ఎంబీఏ చదవాలని ఆశపడింది. అనుకున్నట్టే గానే ఎంబీఏ సీటు సాధించింది. ప్రస్తుతం ఫ్రంట్‌లైన్‌ సంస్థలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న నమ్రత.. 2021 సంవత్సారానికి గాను యూకే వెళ్లి ఏషియన్‌ స్టార్స్‌లో జాబితాలో టాప్‌10లో నిలిచింది.

పర్వతారోహణపై ఆసక్తి: అమెరికాలో ఉన్న సమయంలో నమ్రతకు పర్వతారోహణపై ఆసక్తి ఏర్పడింది. చుట్టుపక్కల ఉండే కొండల్ని ఎక్కేది. అదే ఉత్సాహంతో దక్షిణాఫ్రికా టాంజానియాలోని కిలిమంజారో పర్వతం ఎక్కాలనే కోరిక ఆమెలో బలంగా మారింది. కొద్దిపాటి శిక్షణ, తగు సాధన తర్వాత అక్కడ బేస్‌ క్యాంపు చేరుకుంది. అనుభవం లేకున్నా గడ్డకట్టే చలిలో సముద్రమట్టానికి 19వేల అడుగులకి పైన ఎత్తున్న కిలిమాంజారో శిఖరాన్ని అధిరోహించింది.

17 మంది పిల్లల దత్తత: సౌత్‌ కరోలినాలో చదివే సమయంలో నమ్రత.. వివిధ దేశాలకు చెందిన నిరుపేద, అనాథ పిల్లలను చూసి చలించిపోయింది. వారికి తన వంతుగా సహాయం చేయానుకుంది. 17 మంది పిల్లలను దత్తత తీసుకుంది. వాళ్ల చదువులు, ఇతర అవసరాలు తానే చూస్తోంది. ప్రపంచంలో ఎక్కడ ఏ విపత్తు వచ్చినా తన వంతు సహాయాన్ని అందిస్తోంది. సామాజిక మాధ్యమాల ద్వారా విరాళాలు సేకరించి.. భాదితులకు అందిస్తోంది. ఉత్తరాఖండ్‌, బిహార్‌లో వరదలు వచ్చినప్పుడు హ్యుమన్‌ చెయిన్‌ పేరిట వైబ్‌సైట్‌ ప్రారంభించింది. దీని ద్వారా సేకరించిన డబ్బుల్ని నష్టపోయిన వారికి అందించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఒక్కోమెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరానంటోంది నమ్రత. ప్రస్తుతం ఎవరెస్ట్‌ శిఖరాన్ని సైతం అధిరోహిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది..ఈ యువతి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.