ETV Bharat / state

సొంతంగా సాగు చెయ్​.. ఆరోగ్యాన్ని పట్టేయ్​..!

యావత్‌ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి తీవ్రంగా ప్రభావితం చేసిన తరుణంలో సురక్షిత ఆహారం, ఆరోగ్యకరమైన జీవన విధానాలను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్​ ఉద్యానశాఖ ప్రత్యేక చొరవ చూపుతోంది. తీసుకునే ఆహారం విషతుల్యమైతే తద్వారా ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ దిశగా చర్యలు ప్రారంభించింది. వ్యవసాయ భూముల్లోనే కాకుండా ఇళ్లు, ఖాళీ ప్రదేశాలలో తోటలు, మొక్కల పెంపకాన్ని చేపట్టించేందుకు ఉద్యానశాఖ తక్కువ ధరకు మొక్కలు అందిస్తోంది. రసాయన వాడకాలు తగ్గించి సేంద్రీయ వ్యవసాయ విధానాలను అనుసరిస్తే సొంతంగా సాగు చేసిన వ్యవసాయ ఉత్పత్తులతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని ఉద్యానశాఖ పేర్కొంటోంది.

సొంతంగా సాగు చెయ్​.. ఆరోగ్యాన్ని పట్టేయ్​..!
సొంతంగా సాగు చెయ్​.. ఆరోగ్యాన్ని పట్టేయ్​..!
author img

By

Published : Sep 25, 2020, 7:59 PM IST

వాతావరణ పరిస్థితులు అనుకూలించినా, ప్రతికూలించినా... నాణ్యమైన మొక్కలు వినియోగించకపోతే ఎంత కష్టపడినా ఆశించిన పంట దిగుబడి రాదన్నది నగ్నసత్యం. ప్రైవేటు నర్సరీల నుంచి మొక్కలు కొనుగోలు చేసి కొన్ని సందర్భాల్లో రైతులు నష్టపోతున్న ఉదంతాలు ఉన్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్​ ఉద్యానశాఖ సొంతంగా కొన్ని పంటలకు నర్సరీల్లో మొక్కలు పెంచి రైతులకు విక్రయిస్తోంది.

అన్ని మొక్కలు తక్కువ ధరలోనే

కృష్ణా జిల్లా వెల్లటూరులోని ఉద్యానశాఖ నర్సరీలో ఈ ఏడాది 35 వేల మొక్కలు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో కొబ్బరి, వాక్కాయ, కరివేపాకు, మునగ, మామిడి, ఇతర పుష్పజాతుల మొక్కలను అభివృద్ధి చేసింది. వీటిని కేవలం కృష్ణా జిల్లా వాసులకే కాకుండా ఎవరికైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉద్యానశాఖ అధికారులు పేర్కొన్నారు. కొబ్బరి మొక్క ఒకటి 60 రూపాయలకు... ఇతర మొక్కలను ఒక్కొక్కటి 10 రూపాయల చొప్పున అందించాలని నిర్ణయించింది.

తోటబడితో అవగాహన

తోటబడి కార్యక్రమం పేరిట నర్సరీల్లోని మొక్కల కొనుగోలుకు రైతుల్లో అవగాహన పెంచుతోంది ఉద్యానశాఖ. పొలం గట్లతోపాటు ఖాళీ ప్రదేశాల్లో కొబ్బరి మొక్కలను పెంచుకోవడం వల్ల 4 నుంచి ఏడేళ్లలో మంచి దిగుబడి మొదలై- సాగుదారునికి ఏ విధంగా అండగా నిలుస్తుందనేది ఈ తోటబడి అవగాహన సదస్సుల్లో అధికారులు వివరించారు.

కంచెగా వాక్కాయ

పొలాల్లో పంటలను మూగజీవాలు దెబ్బతీయకుండా ఉండేందుకు కంచెగా వాక్కాయ మొక్కలను పెంచుకుంటే ఎంతో మేలు కలుగుతుందని ఉద్యాన అధికారులు తెలిపారు. వాక్కాయ మొక్కను కలే చెట్టు, కరండగా పిలుస్తారు. రాష్ట్రంలోని ఆన్ని ప్రాంతాల చిట్టడవులు, కొండ ప్రాంతాలలో సహజసిద్ధంగా ఈ చెట్లు పెరుగుతాయి. పుల్లగా ఉండే ఈ పళ్ళను కూరలలో పులుపునకు ప్రత్యామ్నాయంగా వినియోగిస్తారు. పప్పు, పచ్చళ్లు, మాంసాహారాల్లో విరివిగా వాడుతారు. ఈ వాక్కాయలు మూత్రపిండాలలో రాళ్ళను కరిగించి- మూత్ర నాళాలని శుభ్రపరుస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఎక్కువ నీటి అవసరం లేనందున ఉష్ణప్రాంతాలు ఈ మొక్క పెరుగడానికి అనుకూలం.

మోతాదుకు మించి ఇష్టానుసారం రసాయనాలు వాడకుండా, సురక్షిత ఆహారం కోసం ఈ తరహా మొక్కలను తీసుకుని సొంతంగా సాగు చేయడం ద్వారా.. రసాయన రహిత సేద్యం సాధించే వీలుంటుందని ఉద్యానవన అధికారులు చెప్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.