హెల్ప్ ఏజ్ ఇండియా ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ప్రపంచ వృద్ధుల వేధింపులు నివారణ అవగాహన దినోత్సవంలో నగర అదనపు పోలీస్ కమిషనర్ శిఖాగోయల్ పాల్గొన్నారు. హెల్ప్ ఏజ్ ఇండియా సహకారంతో పోలీస్‌శాఖ వయో వృద్ధుల సంఘాలను కలిసి వారి సమస్యల పరిష్కారానికి ఓ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. వయో వృద్ధుల సమస్యల పరిష్కారానికి పోలీస్ అన్ని వేళలా సిద్ధంగా ఉంటుందన్నారు. పట్టణ ప్రాంత వృద్ధుల కన్నా గ్రామీణ ప్రాంత వృద్ధుల పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. తల్లిదండ్రుల పోషణ సంరక్షణ చట్టం 2007 ప్రకారంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ నిర్వహణలో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు. లీగల్ సర్వీసు ప్రభుత్వ అనుమతితో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రెవిన్యూ కార్యాలయాల్లోను వృద్ధుల కోసం ప్రత్యేక "హెల్ప్ డెస్క్" లను ఏర్పాటు చేయాలన్నారు.
ఇదీ చూడండి: కానిస్టేబుల్ తులసీరాం కుటుంబాన్ని ఆదుకుంటాం: సీపీ