ETV Bharat / state

పాలిటెక్నిక్ సీట్ల భర్తీ కోసం ప్రత్యేక విడత కౌన్సెలింగ్ - Special counciling for polytechnic seats

గతంలో పాలిటెక్నిక్ కౌన్సెలింగ్​కు హాజరుకాలేని విద్యార్థుల కోసం ఈనెల 8న ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించింది.

పాలిటెక్నిక్ సీట్ల భర్తీ కోసం ప్రత్యేక విడత కౌన్సిలింగ్

author img

By

Published : Oct 6, 2020, 9:05 PM IST

పాలిటెక్నిక్ సీట్ల భర్తీ కోసం ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని సాంకేతిక విద్యా శాఖ నిర్ణయించింది. గతంలో కౌన్సెలింగ్​కు హాజరుకాలేని వారి కోసం ఈనెల 8 నుంచి ప్రక్రియ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. ఈనెల 8న ఆన్​లైన్​లో స్లాట్ బుక్ చేసుకొని, 9న ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని తెలిపారు.

ఈ నెల 9, 10న వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. ఈనెల 12న సీట్లు కేటాయిస్తారు. ఈనెల 12 నుంచి 14న ఆన్​లైన్​లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కాలేజీల్లో చేరాలి. ప్రైవేట్ కళాశాలల్లో తక్షణ ప్రవేశాల కోసం ఈనెల 13న మార్గదర్శకాలు జారీ చేసి.. 20వ తేదీ వరకు ప్రక్రియ పూర్తి చేస్తారు. ఇప్పటి వరకు జరిగిన రెండు విడతల కౌన్సెలింగ్​లో రాష్ట్రవ్యాప్తంగా 132 కళాశాలల్లో 21 వేల 590 సీట్లు కేటాయించగా, మరో 10 వేల 2020 సీట్లు మిగిలాయి.

ఇదీ చూడండి: ఎంసెట్ ఇంజినీరింగ్​లో బాలురదే పైచేయి...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.