ETV Bharat / state

అంతరాలయం ప్రవేశం లేదు... కానీ అభిషేకానికి అడ్డంకి లేదు.. - హైదరాబాద్​ తాజా వార్తలు

దైవ దర్శనం మనసుకు సాంత్వనం కలిగోస్తుంది... బంధాలకు దూరం చేసిన కరోనా... భగవంతుడి దర్శనానికి తాళం వేయించింది. నిత్యం దూప దీప నైవేథ్యాలతో కళకళలాడే దేవాలయాలు లాక్​డౌన్​ సమయంలో వెలవెలబోయాయి. అన్​లాక్​ నిబంధనలు వచ్చినప్పటి నుంచి ఇప్పుడిప్పుడే భక్తులు దైవ దర్శనాలకు క్యూ కడుతున్నారు. కోఠిలోని పురాతన శివాలయంలో భక్తులే స్వయంగా స్వామివారికి అభిషేకించే ఏర్పాటు చేశారు. అదెలా అంటారా....

అంతరాలయం ప్రవేశం లేదు... కానీ అభిషేకానికి అడ్డంకి లేదు..

author img

By

Published : Oct 9, 2020, 6:00 AM IST

అంతరాలయం ప్రవేశం లేదు... కానీ అభిషేకానికి అడ్డంకి లేదు..

హైదరాబాద్​ కోఠిలో పురాతన శివాలయం. చాలా కాలంగా భక్తులకు ఇష్టదైవంగా కొలువైన శివుడు లాక్​డౌన్​ కాలంలో గుడిని మూసివేయడం వల్ల నిత్యపూజలకే పరిమితమయ్యాడు. పూజారులు మాత్రం ఉదయం, సాయంత్రం వచ్చి... నిత్యం నిర్వహించే కార్యక్రమాలు, అభిషేకం చేసేవారు. గత రెండు నెలలుగా లాక్​డౌన్​ సడలింపులు మొదలవడం వల్ల దైవ దర్శనానికి క్రమంగా భక్తులు వస్తున్నారు. ఆలయంలో రద్దీ ఏర్పడకుండా.. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక వసతిని ఏర్పాటు చేశారు.

స్వామికి అభిషేకం చేయాలనుకునేవారు పూజారికి ఇవ్వకుండా వారే నిర్వహించవచ్చు. అంతరాలయంలోనికి ప్రవేశించకుండా గేటు బయట నుంచే ఒక పైపును ఏర్పాటు చేశారు. ఈ పైపులో పోస్తే అవి శివలింగాన్ని అభిషేకిస్తున్నాయి. భక్తులు తీసుకొచ్చే జలం, పాలు, పళ్ల రసాలు, తేనె వంటి పదార్థాలతో శివునికి అభిషేకం జరుగుతోంది.

భక్తులకు సౌకర్యంగా ఉండేలా పైపును ఏర్పాటు చేశారు. అక్కడే అభిషేకానికి కావాల్సిన నీటిని అందుబాటులో ఉంచారు. పూజారి లోపలే ఉండి కార్యక్రమం నిర్వహిస్తాడు. గుడి మూసివేసిన తర్వాత కూడా గేటు బయట నుంచి దర్శనం చేసుకుని పైపు ద్వారా స్వామివారికి అభిషేకించుకునే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: 'అన్ని తహసీల్దార్​ కార్యాలయాలకు అదనపు ఇంటర్నెట్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.